Ayodhya:అయోధ్య రామయ్య దర్శనం చేసుకోవాలంటే ఇవి తప్పక తెలుసుకోవాలి..

జనవరి 23 నుంచి అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవడానిక ఇసామాన్య ప్రజలుకు అవకాశం కలిపిస్తున్నారు. అయితే బాలరాముడిని దర్శించకోవాలంటే మందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతో పాటూ కొన్ని రూల్స్ కూడా పాటించాలి. అవేమిటో కింద చూడండి..

Ayodhya:అయోధ్య రామయ్య దర్శనం చేసుకోవాలంటే ఇవి తప్పక తెలుసుకోవాలి..
New Update

Ayodhya:అయోధ్య రామయ్యను కన్నులారా వీక్షించే సమయం దగ్గర పడుతోంది. దశాబ్దాల నిరీక్షణకు మరో రెండు రోజుల్లో తెర పడనుంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట మహోత్సం కోసం దేశమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 8వేల మంది ప్రముఖులు హాజరవనున్నారు. ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిపేలా అన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. జనవరి 22న అయోధ్య రాముడు కొలువు తీరిన తర్వాత మర్నాడు అంటే జనవరి 23 నుంచి దేశ ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించనున్నారు.

Also read:అయోధ్య బాల రాముని విగ్రహం చుట్టూ దశావతారాలు!

రిజిస్ట్రేషన్ తప్పనిసరి...
అయోధ్య రామయ్య దర్శనానికి కొన్ని రూల్స్ పెట్టారు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు. తిరుమల శరీవారి దర్శనం మాదిరిగా ఇక్కడ కూడా అయోధ్య రామయ్యను దర్శించుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. దీని కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. మన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వొచ్చు. దాని తర్వాత ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో దర్శన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి...దాంట్లో వచ్చే డీటైల్స్‌ను నింపాలి.తేదీ, సమయం, ఎంతమంది వస్తారు, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్‌తో పాటు ఫోటోను కూడా అప్‌లోడ్ చేయాలి.ఇదంతా పూర్తయ్యాక మన దర్శనం కన్ఫార్మ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకుని వెళ్ళి అక్కడ చూపిస్తూ మనల్ని గుడిలోపలికి అనుమతిస్తారు.

ఆఫ్‌లైన్‌లోనూ...
శ్రీరాముని దర్శనం టికెట్లు ఆఫ్‌లైన్‌లోనూ పొందవచ్చును. గుడి దగ్గర ఉండే కౌంటర్ల దగ్గరకు వెళ్ళి ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపిస్తూ టికెట్‌ను ఇస్తారు. పదేళ్ళకన్నా తక్కవు వయసుగల పిల్లలకు టికెట్లు అక్కర్లేదు. అలాగే టికెట్ కోసం ఎటువంటి డబ్బులు కూడా పే చేయక్కర్లేదు. కానీ ఆఫ్‌లైన్‌లో వెళితే ఆరోజు పరిస్థితి, పరిమితిని బట్టి టికెట్లు ఇస్తారు. తీరా అక్కడదాకా వెళ్ళాక, వెయింట్, క్యానిలేషన్ లాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనుకుంటే మాత్రం ఆన్‌లైన్‌లోనే ముందుగానే దర్శనం బుక్ చేసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు ట్రస్ట్ అధికారులు. మఅన్నింటికన్నా ముఖ్యంగా దర్శనం టికెట్‌తో పాటూ ఐడీప్రూఫ్‌ ను మాత్రం కచ్చితంగా క్యారీ చేయాలి. అడిగినప్పుడు తప్పనిసరిగా చూపించాలి. లేదంటే అనుమతిని నిరాకరిస్తారు.ఇక దర్శనానికి 24 గంటల ముందు దానికి సంబంధించిన మెసేజ్‌ లేదా మెయిల్ వస్తుంది. అలాగే దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

సంప్రదాయ దుస్తులు మాత్రమే...
చాలా గుళ్ళల్లో మాదిరిగానే అయోధ్య రామాలయంలో కూడా సంప్రదాయ దుస్తులు వేసుకునే వారిని మాత్రమే అనుమతిస్తారు. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టా లేదా చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి. మిగతా ఏ దుస్తులు వేసుకున్నా ఆలయ ప్రవేశం లేదు.

Also read:మహాలక్ష్మి పథకానికే జైకొట్టిన మహిళలు.. దానికే ఎక్కువ దరఖాస్తులు

#ayodhya #darshan #ram-lalla #regestration
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe