AP Cabinet Ministers List: ఏపీలో మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే దానిపై ప్రజల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జనసేన, బీజేపీకి ఎన్ని మంత్రి శాఖలు ఇస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీల్లో అత్యధిక ఎమ్మెల్యేలు గెలుపొందడంతో.. సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా మంత్రి పదవులు ఇచ్చే విషయంలో కేబినేట్ కూర్పు కత్తిమీద సాములా మారింది. ఎవరెరవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లా
* కూన రవికుమార్ (కాళింగ) -ఆముదాలవలస
* అచ్చెన్నాయుడు (బీసీ- పోలినాటి వెలమ) - టెక్కలి
విజయనగరం జిల్లా
* కళా వెంకట్రావు (కాపు), స్పీకర్ - చీపురుపల్లి
* గుమ్మడి సంధ్యా రాణి (ఎస్టీ) -సాలూరు
విశాఖ జిల్లా
* అనిత - (ఎస్సీ)- పాయకరావుపేట
* కొణతాల రామకృష్ణ (బిసి) - అనకాపల్లి
తూర్పు గోదావరి జిల్లా
* పవన్ కల్యాణ్ (కాపు) - పిఠాపురం
* గోరంట్ల బుచ్చయ్య చౌదరి (కమ్మ) - రాజమండ్రి రూరల్.
పశ్చిమగోదావరి జిల్లా
* నిమ్మల రామానాయుడు (కాపు) - పాలకొల్లు.
* రఘురామ కృష్ణంరాజు (క్షత్రియ) - ఉండి
Also Read: ఎన్డీయే పక్ష నేతగా మరోసారి ప్రధాని మోదీ ఎన్నిక
కృష్ణా జిల్లా
* కొల్లు రవీంద్ర (బీసీ) - మచిలీపట్నం
* శ్రీరామ్ తాతయ్య (వైశ్య) - జగ్గయ్యపేట
గుంటూరు జిల్లా
* అనగాని సత్యప్రసాద్ (బిసి) - రేపల్లె
* నక్కా ఆనంద్ బాబు (ఎస్సి మాల) - వేమూరు
* నాదెండ్ల మనోహర్ (చౌదరి) -తెనాలి
ప్రకాశం జిల్లా
* డోలా బాల వీరాంజనేయస్వామి (ఎస్సి) - కొండెపి
* గొట్టిపాటి రవి కుమార్(కమ్మ) - అద్దంకి
నెల్లూరు జిల్లా
* పొంగూరు నారాణయ(కాపు) - నెల్లూరు సిటీ
* కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(రెడ్డి) - నెల్లూరు రూరల్
చిత్తూరు జిల్లా
* నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (రెడ్డి) - పీలేరు
* విఎమ్ థామస్(ఎస్సి) - నెల్లూరు
కడప జిల్లా
* భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి (ఎమ్మెల్సీ) - కడప
* మాధవి రెడ్డి (రెడ్డి) - కడప
కర్నూల్ జిల్లా
* బిసి జనార్దన్ రెడ్డి(రెడ్డి) - బనగానపల్లె
* ఎండి ఫరూక్ (మైనార్టీ) - నంద్యాల
అనంతపురం జిల్లా.
* సత్యకుమార్ (బీసీ) - ధర్మవరం
* పయ్యావుల కేశవ్ (కమ్మ) - ఉరవకొండ