Health Tips: పెద్దవాళ్ల పళ్ల కంటే చిన్న పిల్లలవి త్వరగా పాడవుతాయి. దీని కారణం పెద్దవాళ్లు పాటించే జాగ్రత్తలు చిన్నపిల్లలు పాటించకపోవడం. అయితే ఏ వయస్సులోనైనా పళ్లను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. మనం చేసే చిన్న పాటి తప్పులు, మనకున్న చెడు అలవాట్ల కారణంగా దంతాల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
చిన్న వయసులోనే పళ్లు పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...ఎలాంటి అలవాట్లను వదులుకోవాలో చూద్దాం:
1.కొందరికి చల్లని నీళ్లు తాగడం, నోట్లు ఐస్ ముక్కలు వేసుకుని కొరికే అలవాటు ఉంటుంది. ఐస్ ముక్కలు రాళ్లకంటే బలంగా ఉంటాయి. ఫలితంగా పళ్లు విరిగిపోయే ప్రమాదంఉంటుది. చల్లదనం, పళ్లలోపలి భాగాన్ని దెబ్బతీస్తుంది.
2. కాఫీ, టీలకు దూరంగా ఉంటేనే మంచిది. వాటిలోని క్షారత్వం వలల పళ్లమీద మరకలు ఏర్పడుతాయి. సూక్ష్మక్రిములు పెరిగేందుకు ఇవి సాయపడతాయి. ఫలితంగా, చిగుళ్లవాపు, నోటిదుర్వాసన వంట సమస్యలు వస్తాయి. కాఫీ, టీ తాగిన తర్వాత కాసేపటికి నోరు పుక్కిలించాలి.
3. నిమ్మరసం వంటి పుల్లటి ద్రవాలు పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. వీటిని తాగిన తర్వాత చూయింగ్ గమ్ నమిలితే మంచిది.
4. తినగానే బ్రష్ చేస్తుంటారు. ఇది మంచి అలవాటే కానీ తిన్న అరగంట వరకు ఆగి బ్రష్ చేస్తే మంచిది.
5. గోళ్లు కొరికే అలవాటు ఉంటే పళ్ల ఆకారం దెబ్బతీస్తుంది. దవడ, ఎముకలనుకూడా ప్రభావితం చేస్తుంది.