Alcohol: మన ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి చాలా మంది వైద్యులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. అయితే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఇవి ఆల్కహాల్ కంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. వీటిలో పెద్ద మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్, కృత్రిమ చక్కెర ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది. అందుకే ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.
ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలు:
- మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆహారం నుంచి ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలను బహిష్కరించండి. ఈ ఆహారాలు మీ కాలేయానికి చాలా హానికరం. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వు పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది.
అధిక ఉప్పు:
- ఉప్పు మన శరీరానికి ప్రమాదకరం. ఉప్పు తీసుకోవడం ఎంత తగ్గించుకుంటే జీవితం అంత ముందుకు సాగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంలో హెచ్చరించింది. ఉప్పగా ఉండే ఆహారాలు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అధిక సోడియం, అధిక రక్తపోటు కూడా వస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే స్ట్రోక్‌కు దారితీస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తగ్గించండి. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
కూల్‌డ్రింక్స్:
- ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును వెంటనే మానుకోవాలని వైద్యులు అంటున్నారు. శీతల పానీయాలు ఎక్కువగా తాగే వ్యక్తులు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి: సిగరెట్ తాగితే మెదడు పనిచేయడం మానేస్తుందా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?