Kids Health: ఈ ఫుడ్స్ పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం! మార్కెట్లో మనకు వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ లభిస్తున్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు, పెద్దల ఆరోగ్యానికి మంచివనే ప్రకటనలూ రోజూ చూస్తుంటాం. అయితే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని డ్రింక్స్‌ను హెల్తీ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.అవేంటో చూసేయండి! By Durga Rao 16 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి బోర్న్‌విటా (Bournvita) హెల్త్ డ్రింక్ కాదని, దీంట్లో చెక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిపాడు. తర్వాత బోర్న్‌విటాతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ను హెల్త్ డ్రింక్స్ లిస్ట్ నుంచి తీసివేయాలని ఇ-కామర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి ఇలాంటి చాక్లెట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ బేవరేజెస్ పిల్లలకు చాలా ప్రమాదకరం. అందుకే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ (Ministry of Commerce) ఈ డ్రింక్స్‌ను హెల్తీ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. వీటిలో చాలా ఎక్కువ చక్కెర, కృత్రిమ రంగులు, ఇతర హానికరమైన పదార్థాలు ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్, గ్రానోలా బార్లు, ఫ్రూట్ జ్యూస్‌లు, ఫ్లేవర్డ్ యోగర్ట్‌లు వంటివి కూడా ఆరోగ్యకరమైనవి కాదు. ఈ ఆహారాలు పోషకాలతో సమృద్ధిగా ఉన్నాయని మార్కెటింగ్ చేస్తారు కానీ వాటిలో చాలా చక్కెర, ప్రాసెస్డ్ పదార్థాలు ఉన్నాయి. ఈ ఆహారాలు పిల్లల బరువు పెరగడం, షుగర్ వ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే పిల్లలకు ఇంట్లో తయారుచేసిన ఆహారాలను అందించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గింజలు, నట్స్, పండ్లు, గోధుమ పిండి వంటి పదార్థాలతో తయారుచేసిన స్నాక్స్, టిఫిన్లు పిల్లలకు ఆరోగ్యకరమైనవి. పిల్లలకు ఇష్టమైన ఆహారాల్లోనే చక్కెర స్థాయిలు ఉండవచ్చని చెప్పారు గుర్గావ్‌లోని CK బిర్లా హాస్పిటల్‌లో పీడియాట్రిక్స్ & నియో నాటాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సౌరభ్ ఖన్నా. హిందుస్తాన్ టైమ్స్‌కు ఈ వివరాలు వెల్లడించారు. బ్రేక్‌ఫాస్ట్ సెరెల్స్: చక్కగా కనిపించే బొమ్మలు, రంగురంగులతో ఉండే బ్రేక్‌ఫాస్ట్ సెరెల్స్‌లో చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. ప్యాకెట్ల వెనక లేబుల్‌ని జాగ్రత్తగా చూసి తక్కువ చక్కెర ఉండేవి ఎంచుకోవాలి. లేదంటే హోల్-గ్రేయిన్ సెరెల్స్ ఇవ్వడం మంచిది. ఫ్రూట్ జ్యూస్: ఫ్రూట్ జ్యూస్ ఆరోగ్యకరమైనది అనుకుంటాం, అయితే అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది. పండ్లలో సహజ చక్కెరలే ఉంటాయి కానీ వాటిని ఎక్కువగా తాగితే మంచిది కాదు. అందుకే పండ్లు నేరుగా తినిపించాలి, జ్యూస్‌లు తక్కువ ఇవ్వాలి. ప్యాకెట్ స్నాక్స్:పిల్లలకు ఇష్టమైన ప్యాకెట్ స్నాక్స్, ఫ్రూట్ స్నాక్స్, బిస్కెట్లలో చాలా ఎక్కువ చక్కెర దాగుండి ఉంటుంది. ప్యాకెట్లపై రాసి ఉండే పదార్థాల లిస్ట్ జాగ్రత్తగా చూసి, తక్కువ పదార్థాలు, తక్కువ చక్కెర ఉండేవి ఎంచుకోవాలి. ఫ్లేవర్డ్ యోగర్ట్: యోగర్ట్ ఆరోగ్యకరమైన స్నాక్ అనుకుంటాం కదా కానీ ఫ్లేవర్డ్ యోగర్ట్‌లలో చాలా ఎక్కువ చక్కెర ఉంటుంది. పండ్ల ఫ్లేవర్‌తో ఉండే యోగర్ట్‌లు ఎక్కువ చక్కెర ఉండేవి కాబట్టి వాటిని వదిలేయండి. బదులుగా ప్లయిన్ యోగర్ట్‌కు తాజా పండ్లు ముక్కలు వేసి నేచురల్‌గా తీయ్యగా చేసుకోవచ్చు. గ్రానోలా బార్స్:గ్రానోలా బార్స్‌లో చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది. ముఖ్యంగా “హై-ఫ్రక్టోస్ కార్న్ సిరప్” వంటివి. ఇంట్లో చేసినవి లేదా తక్కువ చక్కెర, ఎక్కువ పోషకాలు ఉండే గ్రానోలా బార్స్‌ను ఎంచుకోవాలి. కెచప్‌లు, సాసెస్‌లు:కెచప్, బార్బెక్యూ సాస్ వంటి వాటిలోనూ చాలా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. వాటి ప్యాకెట్లపై పదార్థాలు చూసి, నేచురల్ పదార్థాలు ఎక్కువగా ఉండేవి ఎంచుకోవాలి. లేదా ఇంట్లోనే ఆరోగ్యకరమైనవి తయారు చేసుకోవచ్చు. #children #health-tips #health-care #food మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి