AP CID Questions to Nara Lokesh: టీడీపీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ సీఐడీ (AP CID) ముందు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు అయన్ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే నారా లోకేశ్ ను సీఐడీ ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. ప్రధానంగా పది ప్రశ్నలకు లోకేశ్ ను సీఐడీ అడిగినట్లు తెలుస్తోంది. అవేంటంటే..
1. ఇన్నర్ రింగ్‌రోడ్డు (Inner Ring Road) డిజైన్‌లో మార్పులు ఎందుకు చేశారు?
2. ఇన్నర్ రింగ్‌రోడ్డు డిజైన్‌ను 3సార్లు మార్చాల్సిన అవసరమేంటి?
3. ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనే హెరిటేజ్‌కు భూములు ఎలా కొన్నారు?
4. తప్పు చేయకపోతే హెరిటేజ్ వివరాలు చూపించడానికి ఇబ్బందేంటి?
5. లింగమనేని రమేష్‌కు, మీకు లింకేంటి?
6. లింగమనేని భూముల పక్క నుండే IRR వెళ్లడానికి కారణమేంటి?
7. లింగమనేనికి భూములు కట్టబెట్టినందుకే కరకట్ట ఇల్లును మీకు ఇచ్చారా?
8. రింగ్ రోడ్డు డిజైన్‌లో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఏంటి?
9. టీడీపీ నేతల భూముల రేట్లు పెంచుకునేందుకే IRRలో మార్పులు చేశారా?
10. అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి మీకు ముందే తెలుసా?
ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి..!!
కాగా అమరావతి ఇన్నర్ రిండ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ఏ14గా తేల్చారు సీఐడీ అధికారులు. దీంతో ఈ కేసులో విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయమే ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్న లోకేశ్ కాసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. అటు సీఐడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.