ఆర్టీసీ బిల్లులో ఆ అంశాలేవి.. కేసీఆర్ సర్కార్ ను క్లారిటీ అడిగిన గవర్నర్ తమిళి సై!!

టీఎస్ఆర్టీసీ బిల్.. బాల్ ను గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కోట్ లోకి వేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిన్నింటిని లేఖ రూపంలో సంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆమె పంపారు. ఈ బిల్లులోని 5 అంశాలపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ కోరారు.

New Update
ఆర్టీసీ బిల్లులో ఆ అంశాలేవి.. కేసీఆర్ సర్కార్ ను క్లారిటీ అడిగిన గవర్నర్ తమిళి సై!!

Tamilisai seeks clarifications on TSRTC bill:  టీఎస్ఆర్టీసీ బిల్.. బాల్ ను గవర్నర్ తమిళి సై కేసీఆర్(CM KCR) సర్కార్ కోట్ లోకి వేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిన్నింటిని లేఖ రూపంలో సంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆమె పంపారు. ఈ బిల్లులోని 5 అంశాలపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ కోరారు. అందులో భాగంగా.. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడం పై వివరాలు బిల్లులో లేవని గవర్నర్ తమిళి సై లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

అదే విధంగా ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, లోన్లు గురించి డీటైల్స్ లేవని గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. ఈ లేఖతో బిల్లు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే దానిపై గవర్నర్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు రాజభవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ ముట్టడికి టీఎస్ ఆర్టీసీ నేతలు ట్రై చేస్తున్నారు. బారికేడ్లను తోసుకొని లోపలికి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజభవన్ కీలక ప్రకటన చేసింది.

ఆర్టీసీ యూనియన్ నేతలతో చర్చించడానికి గవర్నర్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో కాసేపట్లో గవర్నర్ ఆర్టీసీ యూనియన్(TSRTC Union) నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బిల్లు పట్ల గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ నిరసనను ఉధృతం చేస్తున్నారు. బస్సులకు బ్రేక్ వేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో .ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Also Read: బిగ్‌ బ్రేకింగ్‌.. రేపు కూడా కొనసాగనున్న తెలంగాణ సమావేశాలు..ఆర్టీసీ బిల్లు ఎఫెక్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు