Dates Benefits: చలికాలంలో ఖర్జూరం తింటే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే షాక్‌ అవుతారు!

New Update
Dates Benefits: చలికాలంలో ఖర్జూరం తింటే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే షాక్‌ అవుతారు!

Dates Benefits: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు. శరీరారికి తగిన పోషకాలు, ఆహారం, పండ్లు కూడా చాలా ముఖ్యం. అయితే.. సీజన్‌ను బట్టి కూడా మనం తినే ఫలాలు మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావాలు చూపుతాయి. అలాంటి వాటిలో ఖర్జూర పండు ముఖ్యపాత్ర పోషిస్తుంది. వింటర్‌లో శరీరంలో ఇమ్యూనిటీ పవర్, ఎనర్జీలెవల్స్ పెరగడానికి, జబ్బుల వంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఇది దోహదం చేస్తుందని ఆహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇందులో శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, క్యాల్షియం, ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, రాగి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఖర్జూర పండు తింటే ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్తమాను తగ్గించే గుణం ఖర్జూరంలో ఉంది

చలి నుంచి తట్టుకోవడానికి ఖర్జూరం శరీరంలో వెచ్చదనాన్ని ఇస్తుంది. రెండు గ్లాసుల వాటర్‌లో 3, 4 ఖర్జూరాలు, కొన్ని మిరియాలు, ఇలాయిచీలు వేసి, ఉడకబెట్టి పడుకునే ముందు తాగితే జలుబు సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా ఆస్తమాను తగ్గించే గుణం ఖర్జూరంలో ఉంది. పైగా రాత్రిపూటను నిద్రను ప్రేరేపించి, మరుసటి రోజు యాక్టివ్‌నెస్‌ను కలిగించడంలో ఖర్జూరం బెస్ట్‌ అని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ తప్పులు చేస్తే మీ ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది..జాగ్రత్త!

శీతకాలంలో చలిగాలుల వల్ల చాలామందికి బద్దకంగా ఉంటారు. అలాంటివారు ఖర్జూర తినడం బెటర్. మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలను ఖర్జూర దూరం చేస్తుంది. లికాలంలో ఖర్జూరాన్ని రెగ్యులర్‌గా తినడంవల్ల పెద్ద పేగు, క్యాన్సర్ ముప్పు, హార్ట్ ఇష్యూస్, బ్యాడ్ కొలెస్ట్రాల్‌‌, గుండెపోటు, రక్తపోటు సమస్యలను నివారిస్తుంది. ఇందులో మెగ్నీషియం ఎక్కువ. దీనిని తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఐరన్ లెవల్స్ పుష్కలంగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. చలికాలంలో ఎక్కువగా హార్మోనల్ అసమతుల్యత, చర్మం పాలిపోవడం, జుట్టు రాలడం, గర్భిణుల్లో రక్త స్రావం వంటి సమస్యలు వస్తాయి. డైలీ ఖర్జూరం తింటే వీటిని దూరం చేయవచ్చు అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు