Mahua Moitra: మహువా లోక్‌సభ ఖాతాను ఆ దేశం నుంచి 47 సార్లు వినియోగించారు: దూబే

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటరీ ఖాతాను దుబాయ్‌ నుంచి దాదాపు 47 సార్లు వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే మరోసారి ఆరోపణలు చేశారు. ఇవి నిజమని తేలితే ఎంపీలందరూ ఆమె అవినీతిని వ్యతిరేకించాలని కోరారు.

Mahua Moitra : మహువా ఇంటికి వెళ్లిన అధికారులు.. చివరికి
New Update

డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. అయితే ఈ కేసులో మరిన్ని బయటపడుతున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్‌ నుంచి దాదాపు 47 సార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ విషయాన్ని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే మహువా మొయిత్రా గురువారం లోక్‌సభ నైతిక కమిటీ విచారణను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించి బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఎక్స్‌( ట్విట్టర్ ) వేదికగా స్పందించారు. దుబాయ్‌లోని వ్యాపారవేత్త హీరానందానికి చెందిన ప్రదేశాల నుంచి మహువా లోక్‌సభ ఖాతాలోకి 47 సార్లు లాగిన్‌ అయినట్లు, అక్కడి నుంచే పలు ప్రశ్నలు అడిగినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయని తెలిపారు. ఈ వార్తలు వాస్తవమని తేలితే.. దేశవ్యాప్తంగా ఎంపీలందరు ఆమె అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని.. హీరానందని స్వప్రయోజనాల కోసం ఆయనే ఈ ప్రశ్నలు అడిగారని రుజువైనట్లేనని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం మనం ఎంపీలుగా పనిచేస్తున్నామా అంటూ మండిపడ్డారు నిషికాంత్ దూబే.

Also read: కేటీఆర్‌, రేవంత్ రెడ్డి ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరిక.. బీజేపీ నేతలు ఏమన్నారంటే

ఇదిలా ఉండగా.. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని.. పార్లమెంటరీ లాగిన్‌ వివరాలను హీరానందానికి ఇచ్చినట్లు నిషికాంత్ దూబే ఇటీవల ఆరోపించారు . మరోవైపు హీరానందాని కూడా మహువాకు లంచం ఇచ్చానని అంగీకరించినట్లుగా ఆయన పేరుతో ఓ అఫిడవిట్‌ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆరోపణలను మహువా ఖండించారు. హీరానందానికి తన లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ ఇచ్చిన మాట వాస్తవమేనని.. కానీ, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని, ప్రశ్నలన్నీ తానే అడిగినట్లు పేర్కొన్నారు. అలాగే హీరానందానితో కేంద్రం బలవంతంగా ఆ అఫిడవిట్‌పై సంతకం చేయించినట్లు మహువా ఆరోపించారు. అయితే మహువాపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ.. ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె గురువారం హాజరుకానున్నారు. అలాగే తనకు లంచం ఇచ్చానని హీరానందాని అంగీకరించినట్లుగా ఉన్న అఫిడవిట్‌పై ఆయనను కూడా ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని మహువా ఎథిక్స్‌ కమిటీని అభ్యర్థించారు.

#telugu-news #national-news #mahua-moitra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe