Viral story: కోడలిపై అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్ చేయించిన అత్త.. ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు!

మనవరాలికి తమ కుంటుంబ పోలికలు లేవని కోడలును అనుమానించిన ఓ అత్త బాలికకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించగా షాకింగ్ సీక్రెట్ బయటపడింది. కొడుకు మరొక మహిళతో కన్నబిడ్డను రహస్యంగా పెంచుకుంటున్నట్లు తెలిసి షాక్ అయింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

New Update
Viral story: కోడలిపై అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్ చేయించిన అత్త.. ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు!

DNA: కుటుంబాల్లో పెద్దలు, పలువురి సందేహాలు కొన్నిసార్లు సంబంధాల పునాదిని కదిలిస్తాయి. ఇవి కొన్నిసార్లు కుటుంబాలను నాశనం కూడా చేస్తాయి. సరిగ్గా ఓ మహిళ విషయంలోనూ ఇదే జరిగింది. మనవరాలు పుట్టినప్పుడు చాలా సంతోషించింది బామ్మ. ఏళ్ల తరబడి పెంచింది. కానీ ఒకరోజు తన మనసు కలవరపడింది. ఎందుకంటే 15 ఏళ్ల మనవరాలు లిండ్సే తన ఇతర తోబుట్టువుల కంటే భిన్నంగా కనిపించింది. మనవరాలికి తన కుటుంబంలో ఎవరి పోలికలు రాకపోవడంతోపాటు వింత అలవాట్లు ఉన్నాయనే కారణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారు రంగు రింగుల జుట్టు కలిగివున్న బాలిక బహుశా తమ కుటుంబానికి చెందిన కూతురు కాదేమో అని భావించిన బామ్మ.. మనవరాలికి DNA టెస్ట్ చేయించగా అసలు విషయం బయటపడింది.

కోడలు ఏదో దాస్తోందేమో అని..
ఈ మేరకు మొదట కోడలు ఏదో దాస్తోందేమో అని అనుమానిస్తూ.. ఆ వృద్ధురాలు ఈ కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా పంచుకుంది. 'నా మనవరాలు భిన్నంగా కనిపించినప్పటికీ నేను ప్రేమిస్తున్నాను. నేను ఆమె కోసం ఏదైనా చేయగలను. కానీ ఆమె తన తోబుట్టువుల కంఏట ఎలా భిన్నంగా కనిపిస్తుందో తెలుసుకోవాలనుకున్నా. నేను నా కొడుకు, కోడలుతో ఈ విషయం చెప్పాను. లిండ్సే పుట్టిన సమయంలో బహుశా ఏదో తప్పు జరిగి ఉండవచ్చని, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమని సూచించాను. కానీ ఆ ఇద్దరూ నా అభ్యర్థనను పట్టించుకోలేదు. ఇక్కడితో మరచిపో అన్నారు. ఆమె మా కూతురే. ఆమెపై మాకు అలాంటి సందేహాలు లేవన్నారు' అని వివరించింది.

ఇది కూడా చదవండి: Aditi rao Hydari: మా అమ్మకోసమే.. సిద్ధార్థ్‌తో ఎంగేజ్ మెంట్ పై అదితి ఓపెన్!

కొడుకు రహస్యం బట్టబయలైంది..
అయితే ఇక్కడే అసలు విషయం బయటపడింది. మనవరాలికి డీఎన్ ఏ టెస్ట్ చేయించిన తర్వాత తాను ఆశ్యర్యపోయే నిజం వెలుగులోకి వచ్చిందని చెప్పింది. 'నా కొడుకుకు వేరే స్త్రీతో సంబంధం ఉందని నాకు తెలిసింది. లిండ్సే ఆమెకు జన్మించింది. కానీ ఆమె తల్లి విడిచిపెట్టి వెళ్లిపోయింది. నా కోడలకు ఈ విషయం తెలుసు' అని తెలిపింది. ఇందుకు సంబంధించిన స్టోరీ వైరల్ అవుతుండగా.. 'మీ కొడుకు, కోడలు తమ కూతురిని బాధపెట్టడం ఇష్టంలేక నిజాలు దాచిపెడుతున్నారు. మీరు కూడా దానిని రహస్యంగానే ఉంచండి. మనవరాలికి ధైర్యం ఇవ్వండి' అంటూ సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు