Jaggareddy: ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నానని.. ఇకపై ఓపిక పట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోసారి తనపై తప్పుడు ప్రచారం చేస్తే తన అనుచరులకు అప్పగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి
New Update

తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మరోసారి స్పందించారు. తనపై వస్తున్న వార్తలపై ఇటీవలే ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చానన్నారు. అయినా కొందరు కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కొందరికి ఎదుటి వ్యక్తిని అవమానించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.తాను 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని జగ్గారెడ్డి తెలిపారు. రాజకీయాల్లో అనేక సమస్యలు, ఒడిదొడుకులు వచ్చాయని, వాటన్నింటిని ఎదుర్కొంటూ ఎదిగానని గుర్తు చేశారు. తన అమ్మకు వస్తున్న జీతంతోనే జీవనం కొనసాగించానన్నారు.

తాను 4వ తరగతి చదువుతున్న సమయంలో తన తండ్రి చనిపోయారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. తాను అప్పుడే రాజకీయాల్లోకి వెళ్లానని జగ్గారెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినా అప్పులే చేశానని, ఎలాంటి ఆస్తులను సంపాధించలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఈ విషయం తెలుసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే సూచించారు. కోట్ల కొద్ది అప్పులు తెచ్చి సభలు నిర్వహించి కాంగ్రెస్‌ క్యాడర్‌ను కాపాడుకున్నట్లు వెల్లడించిన ఆయన.. మళ్లీ దీనిపై సైతం అనుమానాలు సృష్టించొద్దన్నారు.

ఎంతమంది అసత్య ప్రచారం చేసినా తాను ఇంతకాలం భరించానన్న ఆయన.. ఇకపై ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అంతే కాకుండా వారిపై పరువు నష్టం దావా వేస్తానని, లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు. అయినా వాళ్లు మారకపోతే వారిని తన అనుచరులకు అప్పగిస్తానని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు తనకు ఆస్తులు ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన జగ్గారెడ్డి.. ఎవరైనా తనకు ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే వారికి మంచి బహుమతి ఇస్తానన్నారు. క్యారెక్టర్‌ ఉన్న వ్యక్తులను బద్నం చేయవద్దన్న ఎమ్మెల్యే.. ఇది తన ఫైనల్‌ వార్నింగ్‌ అని తేల్చి చెప్పారు.

#fake-news #complainant #legal-notices #jaggareddy #high-command #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe