Theater v/s OTT : థియేటర్ హను మాన్ వర్సెస్ ఓటిటి హనుమాన్ .. ఒకే రోజు రెండు హనుమాన్ లు సందడి

హను-మాన్ మూవీ థియేటర్స్లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదే టైంలో డిస్నీ+ హాట్ స్టార్ లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” అనే సూపర్ హిట్ యానిమేటెడ్ సిరీస్ మూడో సీజన్ ని ఈరోజే రిలీజ్ చేయడం విశేషం. .థియేటర్స్లో హనుమాన్ అధరగొడుతుంటే.. ఓటిటి లో సైతం హనుమాన్ దుమ్ము రేపుతున్నాడు.

Theater v/s OTT : థియేటర్ హను మాన్ వర్సెస్ ఓటిటి హనుమాన్ .. ఒకే రోజు రెండు హనుమాన్ లు సందడి
New Update

Hanu-Man vs HANUMAN : సంక్రాంతి(Sankranti) బరిలో చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ లో కనక వర్షం కురిపిస్తున్న మూవీ హను మాన్(Hanu-Man). ప్రశాంత్ వర్మ(Prashanth Varma) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజయి అందరి అభిమానాన్ని చూరగొంటోంది. అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో టాలీవడ్( లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ వర్మ సెల్యులాయిడ్ వండర్ లా హనుమాన్ చిత్రాన్ని రూపొందించారని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.

థియేటర్ హను మాన్ వర్సెస్ ఓటిటి హనుమాన్ .. ఒకే రోజు రెండు హనుమాన్ లు సందడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలతో నటించిన తేజ సజ్జ(Teja Sajja) హనుమాన్ మూవీలో మైండ్ బ్లోయింగ్ నటనను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నాడు. ఆధ్యంతం ఆకట్టుకునే విజువల్స్ తో .. గుస్ బంప్స్ పుట్టించే ఎన్నో సన్నివేశాల సమాహారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్స్ లో దుమ్మురేపుతోన్న క్రమంలోనే ఈ సినిమాకు మరో హనుమాన్(Hanuman) సినిమా పోటీగా రిలీజయింది. అదేంటి .. మరో హనుమాన్ మూవీ ఏంటి అనుకుంటున్నారా ? యస్ .. మీరు విన్నది నిజం .. కాకపోతే ఇది థియేటర్(Theater) సినిమా కాదు. కేవలం ఓ టి టి(OTT) లో స్టెమ్మింగ్ అవుతోన్న సిరీస్ . ప్రముఖ ఓట్ టి స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” అనే సూపర్ హిట్ యానిమేటెడ్ సిరీస్ ఉంది. రెండు సీజన్లు సక్సస్ ఫుల్ గా రన్ అయిన ఈ సిరీస్ మూడో సీజన్ ని హాట్ స్టార్ సంస్థ ఈరోజే రిలీజ్ చేయడం విశేషం. . ధీంతొ హను- మాన్ వెర్సస్ హనుమాన్ లా ఒకే రోజు రెండు హనుమాన్ సినిమాలు బరిలోకి దిగి హాట్ టాపిక్ గా మారాయి. ఇక.. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. థియేటర్స్లో హనుమాన్ శరగొడుతుంటే.. ఓటి టి లో సైతం హనుమాన్ దుమ్ము రేపుతున్నాడు.

హను మాన్” ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్స్ 

ఇక .. తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా టోటల్ నాన్ థియేట్రికల్ హక్కుల్ని(ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్స్) కూడా జీ సంస్థ  కొనుక్కున్నారని సమాచారం.జీ తెలుగు, జీ సినిమా ఓటీటీ జీ 5 వారు హను మాన్ హక్కులు సొంతం చేసుకోగా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత హనుమాన్ చిత్రం ప్రదర్శింపబడుతుంది.

హనుమాన్ సీక్వెల్స్

ఈ మూవీలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. చిన్న బడ్జెట్ తో వచ్చి పాన్ వరల్డ్ సినిమాగా అందరితో శభాష్ అనిపించుకుంటున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ చిత్రానికి సీక్వెల్స్ సైతం రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు,. మొదటి భాగమే ఇంతటి సంచలన హిట్ సాధిస్తే,., ఇక,, మిగిలిన భాగాలు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

ALSO READ : HanuMan Movie Highlights: హనుమాన్ మూవీలో హైలెట్స్ అవే !!

#ott #theater #hanuman #hanu-man
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe