Crime News: మామతో కలిసి భర్తను చంపిన భార్య.. సెప్టిక్ ట్యాంకులో డెడ్ బాడీని దాచి.. మద్యం సేవించి తమను హింసిస్తున్నాడనే కోపంతో ఓ భార్య మామాతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాములు మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టి తర్వాత గుంత తవ్వి పూడ్చిపెట్టడంతో ఘోరం బయటపడింది. By srinivas 24 Jun 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Nizamabad: కలకాలం తోడుంటానని మాటిచ్చి మూడుముళ్లు వేయించుకున్న ఓ భార్య తన భర్తను దారుణంగా హతమార్చింది. రోజూ మద్యం తాగొచ్చి విసిగిస్తున్నాడనే నెపంతో మామాతో కలిసి అర్ధరాత్రి కట్టుకున్నవాడిని కడతేర్చింది. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్ లో దాచి ఏమీ ఎరగనట్టే అమాయకంగా అందరిముందు తిరిగింది. ఈ దారుణమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరగగా.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జులాయిగా తిరుగుతూ వేధింపులు.. ఈ మేరకు బాన్సువాడ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తిర్మలాపూర్‌కు చెందిన రాములు (33) జులాయిగా తిరుగుతుండేవాడు. తాగి వచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణను కొడుతూ హింసించేవాడు. దీంతో విసిగిపోయిన వారిద్దరు కలిసి ఈ నెల 9న రాములును హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టి.. తర్వాత ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. ఇది కూడా చదవండి: Students Protest: సీఎం రేవంత్ నిరుద్యోగులను మోసం చేశారు.. TGPSC కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ సంఘాలు! ఈ క్రమంలోనే పది రోజులుగా రాములు కనిపించకపోవడం స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తవ్విన గుంత అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరిని నిలదీశారు. దీంతో రాములును హత్య చేసినట్లు వారిద్దరూ అంగీకరించడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గుంతను తవ్వగా మృతదేహాం బయటపడింది. పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించాం. ఈ ఘనపై కేసు నమోదు చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. #crime-news #nizamabad #kamareddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి