Students Protest: సీఎం రేవంత్ నిరుద్యోగులను మోసం చేశారు.. TGPSC కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ సంఘాలు!

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాయి. సీఎం రేవంత్ నిరుద్యోగులను పట్టించుకోవట్లేదని, ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసిందంటూ పది డిమాండ్లతో నిరసన చేపట్టారు.

New Update
Students Protest: సీఎం రేవంత్ నిరుద్యోగులను మోసం చేశారు.. TGPSC కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ సంఘాలు!

Hyderabad: రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని (TGPSC OFFICE) ముట్టడించాయి. ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిజీగా ఉంటూ.. నిరుద్యోగులను గాలికి వదిలేశాడంటూ సోమవారం ఆందోళనకు దిగాయి. కేసీఆర్ నియమకాలను తనివిగా చెప్పుకొంటూ రేవంత్ నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని, తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలొనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి.. నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. తేదీలతో సహా కాంగ్రెస్  ప్రకటించిన జాబ్ క్యాలెండర్ (Job Calendar) ఏమైందని ప్రశ్నించారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి, 6 నెలలైనా ఉద్యోగాల ఊసేత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ..వారి జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలి. లేదంటూ ఉద్యమం ఉదృతం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెళ్లి రాజు, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ, ఓయూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నాయకులు మన అశోక్ యాదవ్, లింగం శాలివాహన, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు జక్కుల మధు తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్స్:
1. గ్రూప్-2లో 2,000 వరకు పోస్టులు పెంచాలి.
2. గ్రూప్-3లో 3,000 వరకు పోస్టులు పెంచాలి.
3.గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్ప త్తిలో అభ్యర్థులను పిలవాలి
4. డీఎస్సీలో ఉన్న 11 వేల పోస్టులను 25వేలకు పెంచాలి
5. జీవో 46ను వెంటనే రద్దు చేయాలి.
6. గురుకుల పోస్టుల్లో లింక్విప్మెంట్ అమలు చేయాలి.
7. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.
8. జాబ్ క్యాలెండర్ను తక్షణమే ప్రకటించాలి
9. రూ.4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి
10. డిసెంబర్ లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలి.

Also Read: రూ.33 కోట్లు గెలుచుకున్నాడు.. ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు