Kohli Rohit: రోహిత్‌, కోహ్లీ టీ20 భవితవ్యం తేలేది నేడే.. బీసీసీఐ మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ!

భారత్‌ స్టార్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీ20 భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరికి చోటు కల్పించాలా లేదా అన్నదానిపై చర్చించేందుకు ముంబైలో బీసీసీఐ భేటీ కానుంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ ఉండడంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

New Update
Kohli Rohit: రోహిత్‌, కోహ్లీ టీ20 భవితవ్యం తేలేది నేడే.. బీసీసీఐ మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ!

ఈ ఏడాది(2024)జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌(World Cup) జరగనున్న విషయం తెలిసిందే. గతేడాది(2023) వన్డే వరల్డ్‌కప్‌ను చివరి మెట్టుపై చేజార్చుకున్న రోహిత్ సేన.. టీ20 వరల్డ్‌కప్‌ను ఎలాగైనా గెలవాలని కసితో ఉంది. అయితే తుది జట్టు కూర్పుపై బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. యువ జట్టుతోనే ముందుకు వెళ్లాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోని వెటరన్‌ ప్లేయర్లు రోహిత్, కోహ్లీని వన్డే, టెస్టు ఫార్మెట్లకు పరిమితం చేయాలని బోర్డు పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే జనవరి 11 నుంచి అఫ్ఘానిస్థాన్‌పై టీ20 సిరీస్‌ ప్రారంభం అవుతుండగా.. ఈ మూడు పొట్టి ఫైట్ల సిరీస్‌కు రోహిత్, కోహ్లీ అందుబాటులో ఉంటామని బీసీసీఐకు చెప్పినట్టు సమాచారం. దీంతో బీసీసీఐ నెక్ట్స్ ఏం చేయనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రోహిత్‌(Rohit), కోహ్లీ(Kohli) టీ20లు ఆడేందుకు ఆసక్తిగా ఉండగా.. బీసీసీఐ యువ జట్టుపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించడంతో ఇవాళ జరగనున్న బోర్డు మీటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

టీమ్‌ సెలక్షన్‌:
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీకు చోటు కల్పించడంపై చర్చించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇవాళ(జనవరి 7) ముంబైలో సమావేశం కానుంది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగొస్తున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు కార్యదర్శి జై షా సహా బీసీసీఐ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియగా.. ఈ మీటింగ్‌లో రోహిత్‌, కోహ్లీ టీ20 భవితవ్యంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్‌ తేల్చనుందా?
అఫ్ఘాన్‌తో సిరీస్‌కు టీమిండియా నుంచి ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు అందుబాటులో ఉండడం లేదు. చీలమండ గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ అఫ్ఘాన్‌తో సిరీస్‌కు దూరం అయ్యాడు. హార్దిక్ పాండ్యా ప్రపంచకప్(2023) సమయంలో గాయం కారణంగా గైర్హాజరయ్యాడు. దీంతో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అఫ్గాన్‌ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఆడే ఛాన్స్ ఉంది. అయితే ఐపీఎల్‌ తొలి నెలలో ప్లేయర్ల ఆటతీరు ఆధారంగా టీ20 వరల్డ్‌కప్‌కు టీమ్‌ సెలక్షన్‌ ఉంటుందని బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అఫ్ఘాన్‌ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీ చోటు దక్కించుకున్నా.. టీ20 వరల్డ్‌కప్‌కు మాత్రం సెలక్ట్ అవ్వాలంటే ఐపీఎల్‌లో సత్తా చాటాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్‌ ప్రణాళికలతో పాటు ఇతర ఫ్యాక్టర్స్‌ దృష్ట్యా ఈ ఇద్దరూ వన్డే, టెస్టు ఫార్మెట్‌లకే పరిమితం కావాల్సి ఉంటుంది.

Also Read: మహిళలకు వేరే కండోమ్ ఉందా? ఫీమేల్ కండోమ్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు!

WATCH:

Advertisment
తాజా కథనాలు