కిలారును వెంబడించిన అగంతకుడు ఎవరు..? టీడీపీ నేత కిలారు రాజేశ్ ను గుర్తు తెలియని దుండగుడు వెంబడించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Bhoomi 08 Nov 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి టీడీపీ నేత కిలారు రాజేష్‍ను గుర్తు తెలియని దుండగుడు అనుసరించిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీ నుంచి నిన్న రాజేశ్ ను దుండగుడు అనుసరించినట్లు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న తన కుమారుడిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. TS 12 AK 8469 నంబర్ గల బైకుపై రాజేశ్ ను దుండగుడు అనుసరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య, పిల్లలకు ప్రాణహాని కలిగించేలా దుండగుడి తీరు ఉందని తెలిపారు. దుండగుడు వెంబడించిన బైక్ నెంబర్ ఫేక్ తేలడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. దుండగుడికి ఫొటోలు, బైక్ వివరాలను కిలారీ రాజేశ్ పోలీసులకు అందజేశారు. రాజేశ్ ఫిర్యాదును అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. fir 706-2023 with complaint కిలారు రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు కాగా కిలారు రాజేశ్ నారాలోకేశ్ కు అత్యంత సన్నిహితుడు. నారాలోకేశ్ తరపున అన్ని వ్యవహారాలన్నీ చక్కదిద్దేది రాజేశే. కొన్ని వ్యవహారాల్లో చంద్రబాబు మాట కంటే రాజేశ్ చెప్పినదానికే లోకేశ్ మొగ్గు చూపుతారని టీడీపీ వర్గాలు అంటుంటాయి. రాజేశ్ పరోక్షంగా టీడీపీ వ్యవహారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు అంటుంటారు. టీడీపీ అనుకూల ఎన్నారైలతో మంతనాలు జరపడంతోపాటు ఆర్థిక వ్యవహారాలన్నీ రాజేశ్ కనుసన్నల్లోనే సాగుతాయనే ప్రచారం కూడా ఉంది. పార్టీలో ఏదైనా పదవి కావాలంటే చంద్రబాబు కంటే రాజేశ్ దగ్గరకు వెళ్తేనే పని అవుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. కాగా చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టు అయినప్పటి నుంచి రాజేశ్ అద్రుశ్యమయ్యాడు. అజ్నాతంలో ఉన్నారా? లేదా విదేశాలకు వెళ్లారా అన్నది ఎవరితెలియదు. ఈ క్రమంలోనే కిలారు రాజేశ్ నిన్న జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ....ఆయన ఇక్కడే ఉన్నారన్న సంగతి తెలిసిపోయింది. అయితే కిలారును వెంబడించిన అగంతకుడు ఎవరు ? ఎందుకు వెంబడించాడు? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. ఇది కూడా చదవండి: రాసిపెట్టుకో…గెలుపు నాదే..బడే నాగజ్యోతి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!! #nara-lokesh #tdp #chandrababu #ap #ap-skill-development #kilaru-rajesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి