Revanth Reddy: 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి..' ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్‌ తొలి ట్వీట్!

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన తొలి ట్వీట్ వైరల్‌గా మారింది. 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది..' అని ట్వీట్ చేశారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయిని చెప్పారు.

Revanth Reddy: 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి..' ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్‌ తొలి ట్వీట్!
New Update

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ(Telangana) రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత అనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రానికి ఎన్నికైన తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. గత తొమ్మిదేళ్లూ తెలంగాణని బీఆర్‌ఎస్‌ పాటించిన విషయం తెలిసిందే. రెండుసార్లు సీఎంగా కేసీఆర్‌ ప్రమాణం చేయగా.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. 65 సీట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇక ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్‌రెడ్డి చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.


రేవంత్‌ ఏం ట్వీట్‌ చేశారంటే:
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందంటూ రేవంత్‌ ట్వీట్ చేశారు. ఇది గత కేసీఆర్‌ ప్రభుత్వానికి చురలంటించే ట్వీట్ అని అర్థమవుతుంది. 'తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు దీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట..' అని రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

రేవంత్‌రెడ్డికి అభినందనల వెల్లువ:
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని తాను హామీ ఇస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ఐడీని మెన్షన్ చేసి మరీ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. నిజానికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

Also Read: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

WATCH:

#congress #rahul-gandhi #revanth-reddy #telangana-elections-2023 #priyanka-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe