ఒక అడుగు అటు ఇటు అయితే జీవితమే మారిపోవచ్చు.. అలానే ఒక అక్షరం అటు ఇటు అయితే అర్థమే మారిపోతుంది. పొరపాట్లు సర్వసాధారణం.. 100కి 100శాతం పర్‌ఫెక్ట్‌గా పని చేయడం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి. అప్పుడప్పుడు తప్పులు డొర్లుతుంటాయి. అయితే కొన్నిసార్లు అవి లేనిపోని వివాదాలకు కారణం అవుతాయి. కొంతమంది 'పక్కా' అని రాయడానికి 'పక్క' అని రాస్తారు. కొన్ని పదాలు అటు ఇటు అయితే కొంపలే కూలిపోతాయి. ఇక క్రికెట్‌లోనూ టెక్నికల్ ఎర్రర్స్‌తో హ్యూమన్ ఎర్రర్స్ మోస్ట్ కామన్. కొన్నిసార్లు స్కోరు కార్డు తప్పుగా వేస్తారు. కొన్నిసార్లు స్కోర్ కార్డులోనే దేశం పేరును తప్పుగా వేస్తారు. క్రికెట్ ఆస్ట్రేలియా అదే చేసింది. క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
A clarifier on this from CA: “The graphic was an automatic feed from a data provider which had not been used previously for a Pakistan game. This was obviously regrettable, and the error we corrected manually as soon as it came to light.” https://t.co/7FttR2iZTR
— Daany Saeed (@daanysaeed) December 6, 2023
అసలేం జరిగిందంటే?
ప్రైమ్ మినిస్టర్ XI-పాకిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా స్కోర్‌బోర్డ్‌లో PAKకి బదులుగా 'P**I' అని రాసి ఉంది. ఇది సోషల్ మీడియాలో చాలా వివాదాన్ని సృష్టించింది. 'P**I' అనే పదం సహజంగా అభ్యంతరకరమైనది. ఇది ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం. దక్షిణాసియా సంతతికి చెందిన తెగ ఇది. దీంతో ఇలా 'P**I' అని డిస్‌ప్లే చేయడం చాలా మంది అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ డానీ సయీద్ మొదట ఈ తప్పును ఎత్తి చూపాడు. దీనికి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తరువాత క్షమాపణలు చెప్పవలసి వచ్చింది.
గ్రాఫిక్ ఆటోమేటెడ్ అని, దానిపై తమకు నియంత్రణ లేదని CA ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే జరిగిన పొరపాటుకు వెంటనే క్షమాపణలు చెబుతూ మాన్యువల్‌గా లోపాన్ని సరిచేసుకున్నామని, మళ్లీ సమస్య తలెత్తదని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కొత్త కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వార్మప్ గేమ్‌లో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌పై డబుల్ సెంచరీ కొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇది అతనికి మూడో డబుల్ సెంచరీ. అతని గ్రేట్ నాక్‌తో విజిటింగ్ టీమ్ బోర్డులో 391 పరుగులు చేసింది.
Also Read: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్ కొరత తీరనుందా?
WATCH: