MPDO: ఎంపీడీవో ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

మాజీ ఎమ్మెల్యే వేధించారని ఇంట్లో ఓ లేఖ రాసి వెళ్లిపోయిన ఎంపీడీవో వెంకటరమణరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఏలూరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఎంపీడీవో మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు జారీ చేశారు.

New Update
AP: మిస్టరీగా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు..!

Narasapuram MPDO Venkataramana: మాజీ ఎమ్మెల్యే వేధించారని తెలుపుతూ ఇంట్లో ఓ లేఖ రాసి వెళ్లిపోయిన ఎంపీడీవో వెంకటరమణరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎంపీడీవో ఏలూరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
ఆయన మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి మధురానగర్ రైల్వే స్టేషన్ లో ఎంపీడీవో దిగినట్లు తెలుస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి కాలవ కట్ట వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అర్ధరాత్రి సమయంలో కాలవలోకి దూకి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. ఒక వ్యక్తి నీళ్లలో దూకినట్లు పెద్దగా శబ్దం వచ్చిందంటున్న స్థానికులు చెబుతున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు. తండ్రి ఆచూకీ కోసం నిన్నంత ఏలూరు కాలవ కట్ట పైనే కుమారులిద్దరు ఎదురు చూశారు.

ఈ క్రమంలోనే గురువారం కూడా కొనసాగనున్న గాలింపు చర్యలు. ఎంపీడీవో మిస్సింగ్ గురించి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీసిన విషయం తెలిసిందే. ఎంపీడీవో తనకు రాసిన లేఖలో వివరాలను గురించి అడిగి తెలుసుకున్న పవన్. ఎంపీడీవో మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని పవన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవో మిస్సింగ్ కు కారుకులైన అందరినీ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పవన్‌ ఆదేశించారు.

Also read: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి!

Advertisment
తాజా కథనాలు