Bhadrachalam : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి! By Bhavana 29 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Godavari : భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల (Rains) వల్ల ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం (Dowleswaram) నుంచి సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులు బట్టి భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వారం క్రితం గోదావరి 51.5 అడుగులకి చేరుకుంది. ఆ తరువాత గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకుంది. అయితే మళ్లీ ఎగువ నుంచి వచ్చిన వరద వల్ల గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం వచ్చింది. 53.9 అడుగులకి పెరిగిన గోదావరి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. 24 గంటల వ్యవధి లో ఆరు అడుగుల మేర గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నలభై ఏడు అడుగుల వద్ద ఉంది.దీంతో మూడవ ప్రమాద , రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నారు .ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొన సాగుతుంది. 43 అడుగుల వద్ద నుంచి మొదటి ప్రమాదం కొనసాగుతుంది. Also read: ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు రాజకీయ ప్రముఖుల అభినందనలు #telangana #rains #godavari #bhadrachalam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి