Chain Snatcher: లవ్ బర్డ్స్ కాదు.. దంపతులే: చైన్ స్నాచింగ్ లో నయాట్రెండ్

నల్గొండ జిల్లా దేవరకొండలో శుక్రవారం పట్టపగలే చైన్ స్నాచింగ్ పాల్పడిన జోడిని పోలీసులు గుర్తించారు. వారిద్దరూ లవర్స్ కాదు. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ తన భార్యతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈజీమనీ కోసమే చోరీలు చేస్తున్నట్లు చెప్పారు.

Chain Snatcher: లవ్ బర్డ్స్ కాదు.. దంపతులే: చైన్ స్నాచింగ్ లో నయాట్రెండ్
New Update

Chain Snatcher: జనాల సొమ్ము దోచేయడంలోనూ దొంగలు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అమాయకులు, వృద్ధులను టార్గెట్ చేసుకుని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల దారి దోపిడీలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేరాల్లో మహిళలు కూడా పాలుపంచుకుంటూ షాక్ ఇస్తున్నారు. పురుషులతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్న నేటి మహిళలు.. దొంగతనాల్లోనూ మగాళ్లకు ధీటుగా దూసుకెళ్తున్నారు. మర్డర్, మానభంగాల్లోనూ భర్తలు, ప్రియులకు సహకరిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. తాజాగా భర్తతో కలిసి ఓ ఇల్లాలు సినిమాటిక్ రేంజ్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఒంటరి మహిళే టార్గెట్..
ఈ మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ జోడి పట్టపగలే రెచ్చిపోయింది. కొంతకాలంగా ఈజీ మనీకి అలవాటైన ఓ యువతి, యువకుడు ఒంటరి మహిళే టార్గెట్ గా దోపిడిలకు పాల్పడుతున్నారు. పక్కా ప్లాన్ తో స్కూటీ, బైకుపై వచ్చి మహిళల మెడలో బంగారాన్ని కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 12వ తేదీ శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యారగండ్ల పల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత అనే మహిళ మెడలో బంగారు చైన్ తెంపేసుకుని పారిపోయారు. అయితే వారు పరారైన దృష్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో ఆ వీడియో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి : Sankranthi: పల్లెబాట పట్టిన పట్నం.. కిక్కిరిసిన బస్సులు, హోటళ్లు

మహిళలకు లిఫ్ట్ ఇచ్చి..
దీంతో వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన పోలీసులు.. మొదట స్కూటీపై వెళుతూ బాధిత మహిళకు లిఫ్ట్ ఇచ్చి.. ఆ తర్వాత కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారం గొలుసును లాక్కొని మాల్ వైపు పారిపోయినట్లు గుర్తించారు. అయితే నిందితులను స్థానికులు వెంబడించినప్పటికి తప్పించుకున్నారని, బాధితురాలు ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగిన యువ జంటను పట్టుకున్నట్లు తెలిపారు.

భార్యభర్తలే..
దేవరకొండ డిఎస్పీ మాట్లాడుతూ.. వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పడి బైక్ నెంబర్ సహాయంతో ఫోన్ నెంబర్ ను తెలుసుకున్నాం. ఆ తర్వాత నిందితులు వివరాలు కనుగొన్నాం. సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు నిందితులను అదుపులో తీసుకున్నామన్నారు. దొంగతనం చేసింది లవర్స్ కాదు. వాళ్లిద్దరూ భార్యభర్తలే. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ తన భార్యతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దోచేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి మార్చుకుంటున్నారు. వ్యసనాలకు అలవాటై చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

#nalgonda #venkatesh #couples #chain-snatcher
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe