Fact Check : ఈసీల నియామకం..ఆ వార్తలన్నీ ఫేక్..ఖండించిన PIB.!

భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదని తెలిపింది.

New Update
Fact Check : ఈసీల నియామకం..ఆ వార్తలన్నీ ఫేక్..ఖండించిన PIB.!

Fact Check :  భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నియామకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదని తెలిపింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను భారత ఎన్నికల సంఘం నిమిస్తున్నట్లు ప్రకటించిందని..వారి పేర్లు డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా రిటైర్డ్ ఐఎఎస్, ప్రియాంశ్ శర్మ రిటైర్డ్ ఐఏఎస్ లను నియమిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఫేక్ వార్తలని తెలిపింది.  ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ఫేక్ వార్తలను సర్క్యూలేట్ చేస్తున్నారంటూ మండిపడింది. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్టు చేసింది.

కాగా కొత్త చట్టం ప్రకారం ఈసీల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మార్చి 15వ తేదీన విచారించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే రిటైర్ అయిన తర్వాత..ఇటీవలే మరో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో లోకసభ ఎన్నికలకు కొద్ద రోజుల ముందు ఎన్నికల కమిషన్ లో రెండు ఖాళీలు ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఈ రెండు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రధాని నేత్రుత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ పిటిషన్ లిస్టును చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్రమంత్రి, లోకసభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండనున్నారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఎన్నికల కమిషనర్లను  కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ADR పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనున్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు..వేదిక వివరాలివే.!

Advertisment
తాజా కథనాలు