NDA Elects PM Modi As Their Leader: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి నేతలు ఈరోజు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయ్యారు. ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ కొనసాగగా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జేడీయు నేత నితీష్ కుమార్, శివసేన షిండే వర్గం తదితర నేతలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
మోదీ నాయకత్వంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలంతా తీర్మానం చేశారు. ఈ మేరకు ఓ లేఖలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ నేతలందరూ తమ సంతకాలు చేశారు. ఇదిలాఉండగా.. జూన్ 7న ఎన్డీయే నేతలు రెండోసారి సమావేశం కానున్నారు. అదే రోజున ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. దీంతో జూన్ 9న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: 56 అంగుళాల ఛాతి వీరుడు.. ఛాయ్‌వాలా టు హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు!