Telangana Congress : ముగిసిన టీ కాంగ్రెస్ నేతల సమావేశం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. By Vijaya Nimma 19 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చే నేతల చేరికలపై చర్చించిన నేతలు.. దీంతోపాటు ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడుతామని, ఈ యాత్ర విడతల వారీగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. యాత్రకు సంబంధించిన తేదీలను ఏఐసీసీ ఖరారు చేస్తుందన్నారు. జిల్లాల వారీగా బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు, ప్రజలకు నమ్మకం వచ్చేలా గ్యారెంటి కార్డులను అందజేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీనికి సంబంధించి విధీవిధానాల కోసం నాలుగు రోజుల్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానున్నట్లు వివరించారు. మరోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. మరో ఆరు నెల్లలో సీఎంను గద్దెదించుతామని వివరించారు. కర్నాటక ఫలితమే తెలంగాణలో వస్తుందన్నారు. కేసీఆర్ దళిత బంధుపేరుతో దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్ పేరుతో అవినీతికి తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఎంత మందికి దళితబంధు ఇచ్చారో చెప్పాలని వారు సవాల్ చేశారు. ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ నెల 30న ప్రయాంకా గాంధీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని, ప్రయాంకా గాంధీ మహబూబ్ నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. మరోవైపు ఆయనతో పాటు మరికొందరు సైతం అదే వేధికపై కాంగ్రెస్ తీర్థంపుచ్చుకునే అవకాశం ఉంది. పార్టీలో చేరేవారిలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనిత,. మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, ఏనుగు రవీందర్ సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు. వీరితో పాటు బిజినెస్ మ్యాన్ ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాని సునీల్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని విశ్వనీయ వర్గాల సమాచారం. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయితో పాటు దిలీప్, మందుల శామేల్, కోదాడకు చెందిన నేత శశిధర్, జడ్పీ చైర్‌పర్సన్లు సునీతా మహేందర్ రెడ్డి, సరిత కాంగ్రెస్‌లో చేరనున్నారు. #mp #house #congress #meeting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి