Delhi : ముగిసిన జగన్-మోడీ భేటీ.. వీటిపైనే సుదీర్ఘ చర్చ?

ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు వీరిద్దరి మధ్య ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు, కేంద్రం వాటా గురించి జగన్ ప్రస్తావించినట్లు సమాచారం.

New Update
Delhi : ముగిసిన జగన్-మోడీ భేటీ.. వీటిపైనే సుదీర్ఘ చర్చ?

Modi-Jagan : భారత ప్రధాని మోడీ(PM Modi) తో ఏపీ సీఎం జగన్(AP CM Jagan) భేటీ ముగిసింది. ఢిల్లీ పార్లమెంట్ భవన్‌(Delhi Parliament Bhavan) లో సుమారు గంటన్నరపాటు వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలతో సహా రాజకీయ అంశాలను ప్రధానితో జగన్ చర్చించినట్లు సమాచారం.

నిధుల విడుదలకు ఆదేశాలు ఇవ్వండి..
ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధుల విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ ఖర్చుకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్రం వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోడీని కోరినట్లు సమాచారం. కాగా ఈ భేటీ అనంతరం జగన్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌ను కలవనున్నారు. రాష్ట్రానికి విడుదల చేయాలని నిధులపై ఆమెతో చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ లేకుండా 100 కంపెనీల్లో ఉద్యోగాలు!

కేంద్రం వాటా పెంచాలి..
అలాగే జాతీయ ఆహార భద్రతాచట్టం ఏపీ ఎక్కువ కవరేజీ అశంతోపాటు ఏపీ కంటే ఆర్థికంగా ముందంజలో వున్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమాన వాటాపై డిస్కస్ చేశారు. ఈ వాటా లభిస్తే రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉంది. కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు(Medical Colleges) కేంద్రం వాటా మరింత పెంచి సాయం చేయాలని ప్రధానిని కోరారు. అలాగే ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని, ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్ తదితర అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్(Delhi Tour) లో అమిషాను కలవడం.. మరోపక్క రాష్ట్రంలో విడుదలైన పలు సర్వేల నేపథ్యంలో జగన్ ప్రధాని మోడీతో భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తిరంగా మారాయి.

Advertisment
తాజా కథనాలు