Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో వివాదం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్..

ఆంధ్రాలో ఎన్నికల హీట్ బాగా రాజుకుంది. కరెక్ట్‌గా ఇలాంటి సమయంలో అక్కడ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ అక్కడ అగ్గి రాజేస్తోంది. 2023లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఇవాళ్టి నుంచి ఎంపిక చేసిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు అవనుంది.

Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో వివాదం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్..
New Update

Land Titling Guarantee Act : ఆంధ్రా(Andhra Pradesh) లో ఈరోజు అమలు అవనున్న ల్యాండ్‌ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్‌ అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చట్టాన్ని 2019లో ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ అనే పేరుతో వైసీపీ(YCP) ప్రపోజ్ చేసింది. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ అమలుకు ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. దీంతో సాంకేతికంగా 2023 అక్టోబరు 31 నుంచే ల్యాండ్‌ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్‌ అమలులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు అది కాగితాల వరకే పరిమితం అయింది. ఈరోజు నుంచి నిజంగా ఎంపిక చేసిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు అవుతోంది. కానీ ఇది ఏంటో... దీని వల్ల ప్రయోజనం ఏంటో తెలియక ఏపీ ప్రజలు అయోమయంలో పడిపోయారు. ఈ చట్టంతో భూ సమస్యలు తీరుతాయా? లేక భూములు కోల్పోవాల్సి వస్తుందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలేంటీ ఏంటీ చట్టం..?
ల్యాంగ్ టైటిలింగ్ గ్యారంటీ చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో భూమి తాలూకా ఓనర్ అని మీ పేరు చేరి, మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అదే తిరుగులేని ఆయుధం అవనుంది. దీనివలన ఎవరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారెంటీగా నష్ట పరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారెంటీ అన్నారు. కొత్త చట్టం ప్రకారం మీ భూ సమస్యపై సివిల్ కోర్టు(Civil Court) ల్లో దావాలు వేయడం కుదరదు. దీనికి స్పెషల్‌గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే తీరుస్తారు.
ఒక వేళ ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి.వీళ్లద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్లాలి.

అనుకూల వాదనలు..
ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌తో భూమి చుట్టూ ఉన్న చాలా గొడవలకు పరిష్కారం దొరుకుతుంది అని అంటోంది వైసీపీ ప్రభుత్వం.
కోర్టులపై భారం తగ్గుతుందని చెబుతున్నారు. నకిలీ పత్రాలతో భూమి కబ్జాలు చేసే అవకాశం ఉండదని అంటున్నారు.

అనుమానాలు..
అయితే ఈ కొత్త చట్టం మీద చాలా అనుమానాలు, సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీని ప్రకారం కోర్టులకు బదులుగా అధికారులే భూ వివాదాలు పరిష్కరిస్తారు. ఈ అధికారులు స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు. అంటే ప్రభుత్వం తల్చుకుంటే ఎవరినైనా టార్గెట్ చేయవచ్చు. దాంతో పాటూ భూమికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి నేరుగా స్థలం విషయంలో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద ఫిర్యాదు చేస్తే సదరు అధికారి విచారించి నిర్ణయం ప్రకటిస్తారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుంది. అప్పుడు ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కూడా అవుతుంది. ఇతరులు ఫిర్యాదు చేస్తేనే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేపట్టాలని లేదు. అలాగే అధికారి కూడా సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు.ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా కేసు పెట్టకేఉండా ఈ కొత్త చట్టం అతన్ని రక్షిస్తుంది. తప్పుడు పత్రాలు ఇచ్చారనే సాకుతో .. 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఉంటుంది. ఒక వేళ మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీర్పు నచ్చక.. హైకోర్టు, లేదా సుప్రీంకు వెళ్లి గెలిస్తే...15 రోజుల్లోపు సదరు అధికారికి ఆ విషయాన్ని తెలియచేయాలి లేదంటే సుప్రీం కోర్టు తీర్పు కూడా చెల్లకుండా పోతుంది. ఇవన్నీ పక్కన పెడితే హైకోర్టు వరకు వెళ్లి.. న్యాయపోరాటం చేయలేని వారి పరిస్థితి ఏంటి? వారికి న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే భూ యజమాని చనిపోతే వారి వారసులు ఎవరు అనేది నిర్ణయించే బాధ్యత అధికారిదే అవుతోంది. ఇవన్నీ ఆమోదయోగ్యమైనవేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వల్ల మరిన్ని గొడవలు వస్తాయేమోనని సందేహాలు వస్తున్నాయి.

Also Read:Amith Shah: రిజర్వేషన్ల రద్దు మీద హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో..కేసులు నమోదు

#land #andhra-padesh #land-titling-guarantee #new-law
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe