Sandeep Lamichhane : మైనర్‌ బాలికపై స్టార్ క్రికెటర్ అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు

నేపాల్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్‌ లామిచానెకు ఖాట్మండ్ కోర్టు షాక్ ఇచ్చింది. గతేడాది ఖాట్మండులోని స్థానిక హోటల్‌లో 17 ఏళ్ల అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేల్చింది. విచారణలో జైలు శిక్షపై నిర్ణయం తీసుకుంటామని ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది.

New Update
Sandeep Lamichhane : మైనర్‌ బాలికపై స్టార్ క్రికెటర్ అత్యాచారం కేసు.. కోర్టు సంచలన తీర్పు

Nepal : నేపాల్ దేశానికి చెందిన ఓ ఆటగాడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఖాట్మండు(Kathmandu) జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సదరు క్రిడాకారుడు 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్లు రుజువు కావడంతో అతన్ని దోషిగా తేల్చింది.

ఈ మేరకు నేపాల్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్‌ లామిచానె(Sandeep Lamichhane) గతేడాది ఆగస్టు లో ఖాట్మండులోని స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో తనను అత్యాచారం చేశాడని 17 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు ఇచ్చింది. అంతేకాదు ఆగస్టు 21న తనను ఖాట్మండులోని పలు ప్రాంతాలలో తిప్పి, అదేరోజు రాత్రి హోటల్ కు తీసుకొచ్చి లైగికంగా వేధించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(Caribbean Premier League) లో ఆడి స్వదేశానికి వస్తున్న క్రమంలో విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతణ్ని జైలుకు తరలించాలని జిల్లా కోర్టు ఆదేశించగా పఠాన్‌ హై కోర్టుకు వెళ్లి లామిచానె బెయిల్‌ తెచ్చుకున్నాడు.

ఇది కూడా చదవండి : CRIME: 25 ఏళ్లకే నలుగురిని పెళ్లాడిన యువతి.. చివరికి అందరూ కలిసి ఏం చేశారంటే

అయితే శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపిన ఖాట్మండు జిల్లా కోర్టు 23 ఏళ్ల లామిచానె అత్యాచారానికి పాల్పడ్డాడని తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణలో జైలు శిక్షపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ శిశిర్‌ రాజ్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఇక ఐపీఎల్‌లో ఆడిన మొదటి నేపాల్‌ ఆటగాడిగా గుర్తింపు పొందిన ఈ లెగ్‌స్పిన్నర్‌ అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా బిగ్‌బాష్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లాంటి లీగ్‌ల్లో ఆడుతున్నాడు. వన్డేల్లో అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా, టీ20ల్లో వేగంగా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అతను నిలిచాడు.

Advertisment
తాజా కథనాలు