Viswam : యాక్షన్, కామెడీ, గ్రాండ్ విజువల్స్ తో 'జర్నీ ఆఫ్ విశ్వం'.. అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో

గోపీచంద్ 'విశ్వం' మూవీ నుంచి 'జారీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో గోపీచంద్ యాక్షన్ సీన్లు, శ్రీను వైట్ల కామెడీ టైమింగ్స్, అద్భుతమైన లోకేషన్స్ చూపించారు. ఈ వీడియో కాస్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.

New Update
Viswam : యాక్షన్, కామెడీ, గ్రాండ్ విజువల్స్ తో 'జర్నీ ఆఫ్ విశ్వం'.. అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో

Gopichand's Viswam : యాక్షన్ హీరో గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీను వైట్ల అంటే ఎంటర్టైన్మెంట్ అని అందరికీ తెలుసు. ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాలో కూడా అదే రకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెబుతున్నారు.

గోపీచంద్ ఈ సినిమాలో కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన లుక్, పెర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీను వైట్ల తనదైన మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి 'జారీ ఆఫ్ విశ్వం' పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో గోపీచంద్ యాక్షన్ సీన్లు, శ్రీను వైట్ల కామెడీ టైమింగ్స్, అద్భుతమైన లోకేషన్స్ చూపించారు.

Also Read : అలాంటి రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా : జాన్వీ కపూర్

ముఖ్యంగా ట్రైన్‌లో జరిగే కామెడీ సీన్లు 'వెంకీ' మూవీని గుర్తు చేస్తున్నాయి. మేకింగ్ వీడియో చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా వరుస పరాజయాల తర్వాత గోపీచంద్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. శ్రీను వైట్ల కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు