TS Elections Janasena : కూకట్‌పల్లిలో తప్పా ఒక్క జనసేన అభ్యర్థికి కూడా 5 వేల ఓట్లు దాటలే.. లిస్ట్ ఇదే!

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 8 చోట్ల కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. బీజేపీతో చేతులు కలిపి పోటీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో బీజేపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

New Update
TS Elections Janasena : కూకట్‌పల్లిలో తప్పా ఒక్క జనసేన అభ్యర్థికి కూడా 5 వేల ఓట్లు దాటలే.. లిస్ట్ ఇదే!

Janasena Party : తెలంగాణ ఎన్నికల ఫలితాలు చాలా మంది అంచనాలకు అందకుండా వచ్చాయి. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న అభ్యర్థులందరూ బొక్కబోర్లా పడ్డారు. రిజల్ట్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ కి తగినట్లే కాంగ్రెస్‌ (Congress) స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా పాగా వేయాలని చూసిన జనసేనకి మాత్రం పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.

బీజేపీతో ''గ్లాసు''లు కలిపి 8 సీట్లలో పోటీ చేసిన జనసేనాని కి షాక్‌ తగిలింది. జనసేన కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ప్రేమ్‌ కుమార్‌ కి తప్ప మిగిలిన ఎవ్వరికీ కూడా కనీసం 5 వేల ఓట్లు కూడా దాటలేదు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ తాండూరులో పోటీకి నిలవగా ఆయనకు కేవలం 4, 087 ఓట్లు మాత్రమే వచ్చాయి.

కోదాడలో నిలిచిన అభ్యర్థికి 2,151 ఓట్లు రాగా, నాగర్‌ కర్నూల్‌ జనసేన (Jana Sena Party) అభ్యర్థికి 1955 ఓట్లు, ఖమ్మంలో నిలిచిన అభ్యర్థికి 3,053 , కొత్తగూడెంలో నిలిచిన క్యాండిడేట్ కి 1945, వైరాలో 2,712 , అశ్వారావుపేటలో బరిలోకి దిగిన వ్యక్తికి కేవలం 2,281 ఓట్లు మాత్రమే వచ్చాయి.జనసేన అభ్యర్థుల తరుఫున వివిధ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, కూకట్‌పల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు.

అయినా సరే ఆ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు. జనసేన పార్టీకి ఎలక్షన్‌ కమిషన్‌ కేటాయించిన గాజు గ్లాసు ఈ సారి ఈసీ ఇవ్వకపోవడంతో ఈసారి బరిలోకి దిగిన అభ్యర్థులంతా కూడా ఇండిపెండెంట్లుగానే పోటీలో నిలిచారు. ఈసారి జనసేన తరుఫు నుంచి కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌, తాండూరులో నేమూరి శంకర్‌ గౌడ్‌, కోదాడలో మేకల సతీష్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ లో లక్ష్మణ్‌ గౌడ్‌, ఖమ్మంలో మిర్యాల రామకృష్ణ , కొత్తగూడెంలో లక్కినేని సురేందర్‌ రావు, వైరాలో డాక్టర్‌ తేజావత్‌ సంపత్‌ నాయక్‌, అశ్వారావుపేటలో ముయబోయిన ఉమాదేవి పోటీకి నిలిచారు.

జనసేన అభ్యర్థులు 8 చోట్ల కూడా డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో బీజేపీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. అసలు తెలంగాణలో అంతగా పట్టు లేని జనసేనకు 8 సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా ఏమాత్రం లాభం లేకుండా పోయిందని తలలు పట్టుకుంటున్నారు. బీజేపీ కి గెలిచే అవకాశాలు ఫుల్‌ గా ఉన్నచోట కూడా జనసేన అభ్యర్థులను నిలిబెట్టడంతో నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు.

జనసేనకు కేటాయించిన 8 సీట్లలో తమ పార్టీ నేతలు పోటీ చేసి ఉంటే కనీసం రెండు మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌ పల్లి, తాండూరు తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.

Also read: ఈ 5 ఫుడ్స్ ని మళ్ళీ వేడి చేసి అస్సలు తినొద్దు.. లిస్ట్ ఇదే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు