IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్‎కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో రెండవ మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కు అంతరాయం వాటిల్లింది. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను నిలిపివేశారు. 9.5ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 79/1గా ఉంది. రుతురాజ్ (8)ఔట్ అయ్యాడు. ప్రస్తుతం శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.

IND vs AUS :  వర్షం కారణంగా  మ్యాచ్‎కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!
New Update

భారత్ , ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్ ల ఓడిఐ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కు అంతరాయం వాటిల్లింది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 9.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అయ్యర్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్ 27 బంతుల్లో 32 పరుగులు చేశాడు. భారత్‌ ఆరంభం అద్భుతంగా ఉంది.అయ్యర్ రాగానే బాధ్యతలు స్వీకరించారు. 6 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేశాడు. అయ్యర్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి ఆడుతున్నాడు. ఈరోజు అయ్యర్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ని ఆశిస్తున్నారు.

కాగా అటు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈరోజు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది . ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఇప్పటివరకు మొత్తం 147 ODI మ్యాచ్‌లు జరిగాయి. 82 మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా తలకు మించిన పైచేయి సాధించింది. భారత జట్టు 55 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగినా ఫలితం లేదు.

భారత్ ప్లేయింగ్ 11:

శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11:

డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్.

#jasprit-bumrah #india-vs-australia #indian-cricket-team #ind-vs-aus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe