Hydra Effect: హైడ్రా దెబ్బకు అడ్వాన్స్‌లు క్యాన్సెల్.. బిల్డర్లకు బిగ్ షాక్!

తెలంగాణలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అమీన్‌పూర్ చెరువు బఫర్‌ జోన్‌లో నిర్మించిన భవనాలను కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. దీంతో ఫ్లాట్స్‌ బుక్ చేసుకున్నవారు బుకింగ్స్‌ రద్దు చేసుకోగా బిల్డర్లు భారీగా నష్టపోతామంటూ తలలు పట్టుకుంటున్నారు.

New Update
Hydra Effect: హైడ్రా దెబ్బకు అడ్వాన్స్‌లు క్యాన్సెల్.. బిల్డర్లకు బిగ్ షాక్!

Hydra Effect: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అక్రమ కట్టడాలను కూల్చడంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్కినేని నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చడంతో ఒక్కసారిగా జనాలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్నవారు తమ బుకింగ్స్‌ రద్దు చేసుకొని డబ్బులు తిరిగి తీసుకునేందుకు యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో బిల్డర్లకు ఊహించని షాక్ తగలగా ఏం చేయలేని పరిస్థితిలో తీవ్రంగా నష్టపోతామని తలలు పట్టుకుంటున్నారు.

అమీన్ పూర్ చెరువు బఫర్‌ జోన్‌లో కూల్చివేతలు..
ఇందులో భాగంగానే అమీన్ పూర్ చెరువు బఫర్‌ జోన్‌లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడ ఫ్లాట్స్‌ బుకింగ్స్‌ చేసుకున్న కస్టమర్లు తమ ఇండ్లు బఫర్‌ జోన్‌లో ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బఫర్‌ జోన్‌లో ఉంటే తమ బుకింగ్స్‌ కాన్సిల్‌ చేసుకోవాలని చూస్తున్నారు. దీంతోపాటు గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువు, మామిడి చెరువు పూర్తి ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలోవున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని శనివారం మొదలుపెట్టింది.

నీటి వనరుల్లో ఎఫ్‌టిఎల్ పరిధిలోకి వచ్చే భూముల్లో పారిశ్రామిక షెడ్‌లు, అక్రమణలపై హైడ్రా దృష్టి పెడుతోంది. 34 ఎకరాలున్న గగన్‌పహాడ్‌ సరస్సు ప్రస్తుతం 10-12 ఎకరాలే ఉన్నట్లు హైడ్రా కమిషనర్ ఎవీ రంగనాథ్ గుర్తించారు. 2020, 2024లోనూ వరదలవల్ల ఈ ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇక హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లో 72 కొత్త బృందాలను ఏర్పాటు చేశారు.

Advertisment
తాజా కథనాలు