Heavy Rains : భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలెర్డ్‌ను జారీ చేసింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Hyderabad Meteorological Department Yellow Alert For Telangana Districts : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Department) తెలిపింది. జులై 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఒకటి, రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

జులై 13 నుంచి హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) వివరించింది. జులై 9 నుంచి జులై 12 వరకు రామగుండం, ఖమ్మం,మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం వరకు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు నిర్మల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలెర్డ్‌ (Yellow Alert) ను జారీ చేసింది. సోమవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పినపాకలో అత్యధికంగా 11.64 సెం.మీ, కరకగూడెంలో 7.22 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 8.38 సెం.మీ, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 7.83 సెం.మీ, పెద్దపల్లి జిల్లా ముత్తారం-మంథనిలో 7.60 సెం.మీ, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 7.52 సెం.మీ, మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో 7.29 సెం.మీ, మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తిలో 6.98 సెం.మీ, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా రేగొండలో 6.48 సెం.మీ, హనుమకొండ జిల్లా ఐనోల్‌లో 6.07 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Also read: నాకు తెలియదు.. నేను వెళ్లలేదు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు