Mysore : భార్యను 12ఏళ్లు బంధించిన భర్త.. బాక్స్ లో మలమూత్రాలు, కిటికీలోంచి ఫుడ్

ఓ వ్యక్తి తన భార్యను 12ఏళ్లు ఇంట్లో బంధించి తాళం వేసిన సంఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. మలమూత్ర విసర్జనలు ఓ బాక్స్ లోనే చేసిన ఇల్లాలు.. పిల్లలకు కిటికిలోంచి అన్నం పెట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను రక్షించారు. భర్తపై కేసు పెట్టేందుకు ఆమె నిరాకరించడం విశేషం.

New Update
Mysore : భార్యను 12ఏళ్లు బంధించిన భర్త.. బాక్స్ లో మలమూత్రాలు, కిటికీలోంచి ఫుడ్

Karnataka : ఎల్లకాలం తోడుండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చి మనువాడినవాడే ఆమె పట్ల క్రూర మృగమయ్యాడు. అన్నీతానై చూసుకుంటాడని పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చిన ఇల్లాలికి మాటల్లో చెప్పలేనంతా నరకం చూపించాడు. జీవితంపై ఎన్నో ఆశలతో నమ్మివచ్చిన మహిళను 12 ఏళ్లు నాలుగు గోడలకే పరిమితం చేసిన హృదయవిదారకరమైన సంఘటన కర్ణాటక(Karnataka) లో ఆలస్యంగా బయటకొచ్చింది.

మూడో వివాహం..
ఈ మేరకు మైసూర్‌(Mysore) పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైసూర్ కు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెను ఎవరితో కలవనీకుండా, మాట్లాడకుండా ఇంట్లోనే బంధించి తాళం వేసి బయటకు వెళ్లేవాడు. అంతటితో ఆగకుండా సదరు మహిళను చిత్రహింసలకు గురిచేశాడు.

డబ్బాలో మలమూత్రాలు..
మలమూత్ర విసర్జన కోసం అతను ఇచ్చిన ఓ బాక్స్‌నే ఉపయోగించింది. ఉదయం స్కూల్‌కు వెళ్లిన పిల్లలు.. తన భర్త(Husband) పని నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు బయటే ఉండేవారు. వారికి కిటికీలో నుంచి ఆహారాన్ని అందించినట్లు బాధితురాలు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : UP: భార్య ముందే భర్తను 3కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. చక్రాల మధ్య ఇరుక్కుని

ఫిర్యాదు చేయలేదు..
అయితే అతని ఆగడాలను ఎవరికీ చెప్పుకోలేక, తిరిగి ప్రశ్నించలేక ఆమె 12 ఏళ్ల పాటు నాలుగు గోడల మధ్యే విగతజీవిలా ఉండిపోయింది. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని అతని బంధీనుంచి బయటపడేసినట్లు తెలిపారు. ఇంత జరిగిన ఆమె భర్తపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించిందని, తన తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకుంటున్నట్లు చెప్పి కేసు పెట్టకుండానే వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు