సావిత్రి , సత్యవాన్ కథ ఎవరికి తెలియదు, ఇందులో ఆమె తన భర్తను యమరాజు నుంచి రక్షించి అతనిని సజీవంగా తిరిగి తీసుకువచ్చింది. తాజాగా సౌతాఫ్రికాలో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగు చూసింది, ఓ మహిళ తన భర్తను చావు నుంచి కాపాడింది. దక్షిణాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల ఆంథోనీ జౌబర్ట్ తన కుటుంబం,యజమాని తో కలిసి సమీపంలోని డ్యామ్‌లో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఆంథోనీ 12 ఏళ్ల పెద్ద కుమారుడు చెట్టుకు హుక్‌ని వేలాడదీసే క్రమంలో నీటిలో పడిపోయాడు. వెంటనే ఆంథోనీ అతనిని రక్షించి ఒడ్డుకు చేర్చాడు.
ఈ క్రమంలో 13 అడుగులు పొడవున్న మొసలి ఆకస్మికంగా అతనిపై దాడి చేసింది. అతని చేతిని నోటి తో కరచుని నీటి అడుగుకు తీసకువెళ్లటానికి మొసలి ప్రయత్నించింది. వెంటనే ఆంథోనీ తనని రక్షించుకోవడానికి, ఆంథోనీ పిడిగుద్దులు గుద్దుతూ మొసలి కళ్లపై దాడికి యత్నించాడు. కానీ మొసలి ఆంథోనీ శరీరాన్ని సగం నోటిలో తీసుకుంది. ఆంథోనీ యజమాని జోహాన్ నీటిలోకి ప్రవేశించి, ఆంథోనీ బెల్ట్ పట్టుకుని వెనక్కి లాగడానికి ప్రారంభించాడు. ఒకవైపు మొసలి, మరోవైపు యజమాని ఉన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, అతని శరీరంలో సగం మొసలి నోటిలో ఉంది, అయినప్పటికీ అతనికి నొప్పి అనిపించలేదు. ఈ క్రమంలో ఆంథోని భార్య డ్యామ్ దగ్గర నుంచి పెద్ద కర్ర తీసుకొచ్చి మొసలి తలపై కొట్టడం ప్రారంభించింది. ఆమె దాడి ప్రారంభించటంతో మొసలి ఆంథోని ని వదిలేసింది.
అటువంటి పరిస్థితిలో, 36 ఏళ్ల జోహన్ వాన్ డెర్ కోల్ఫ్,33 ఏళ్ల అన్నలైజ్ తీవ్రంగా గాయపడిన ఆంథోనీని పట్టుకుని వెంటనే అతనిని నీటి నుండి బయటకు తీశారు. ఆంథోనికి తీవ్రరక్తస్రావం అవటంతో అతనిని సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం తర్వాత ఆంథోని మాట్లాడుతూ..మొసలి నన్ను పట్టుకున్న తీరు ఇప్పటికీ నా మనసును బాధపెడుతోంది. నా చివరి క్షణం ఇప్పుడే వచ్చినట్లు అనిపించింది. మొసలి సగం శరీరాన్ని మింగేస్తే, మనుగడ అసాధ్యం అని నాకు తెలుసు. కానీ నా బాస్ జోహాన్ నా భార్య అన్నాలీస్ ఎంతో శ్రమించి నన్నుకాపాడారు. నా భార్యకు మొసలి వంటి ప్రమాదకరమైన ప్రాణిని ఓడించే శక్తి ఉందని నాకు ఎప్పుడూ తెలియదు. దాడిలో తన కాళ్లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని తెలిపాడు. కేవలం మొసలి మూడు పళ్ళు మాత్రమే తన శరీరంలో ఇరుక్కుపోయాయని తెలిపాడు. తన ఆరేళ్ల కుమార్తెలు కూడా ఈ దాడిని చూశారని ఆంథోనీ చెప్పాడు.