RGV Vyuham Movie : రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏపీ రాజకీయాల ఆధారంగా తెరకెక్కించిన 'హ్యూహం' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా వ్యూహం సినిమా CBFC సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆర్జీవీ స్పందించారు. ‘వ్యూహం’ సినిమా CBFC సర్టిఫికేట్ హైకోర్టు రద్దు చేయలేదని పేర్కొన్నారు. జనవరి 11 వరకు CBFC ని సంబందిత వివరాలు సమర్పించమని హైకోర్టు ఆదేశించిందని అన్నారు. తదుపరి విచారణ జనవరి 11 కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
‘వ్యూహం’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) జారీని తెలగుదేశం పార్టీ రద్దు చేయమని కోరిందని అన్నారు. పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది మురళీధర్‌రావు వాదించారు. రిట్ పిటిషన్ మెయింటెనబుల్ కాదు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్ 29(ఏ) ప్రకారం ఈ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్‌కు లేదు.. ఎవరి పరువుకు నష్టం కలుగుతుందని భావిస్తే.. వారే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, చిత్రం చూడకుండానే పరువుకు నష్టం వాటిల్లుతుందని.. ఊహించి పిటిషన్ వేయడం ఆక్షేపణీయం.. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంపై కొందరు ఇదే హైకోర్టును ఆశ్రయించారు.. చిత్రం చూడకుండానే ఆరోపణలు చేయడం సరికాదంటూ పిటిషన్‌ను ద్వి సభ్య ధర్మాసనం గతంలో కొట్టివేసింది.. నిపుణులతో కూడిన కమిటీ కూర్చొని చిత్రాన్ని చూసి ఏకగ్రీవంగా సర్టిఫికెట్ జారీ చేసింది. వ్యక్తులను, పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్ కోర్టులో వారు పరువు నష్టం దావా వేసుకోవాలని నిర్మాత-దర్శకుడి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టులో వేయడం తప్పుబట్టాల్సిన అంశం పిటిషన్‌ను కొట్టివేయాలి అని సీబీఎఫ్‌సీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. సినిమాటోగ్రాఫ్ చట్టం, ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్గదర్శకాలు, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం భావ ప్రకటన హక్కును పరిగణనలోకి తీసుకుని రివైజింగ్ కమిటీ ఏకగ్రీవంగా 'యు' సర్టిఫికెట్ మంజూరు చేసిందని కోర్టుకు తెలిపారు.
ALSO READ: