PM Kisan Scheme : రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 8వేలు..!!

రైతులకు కొత్త ఏడాది శుభవార్త చెప్పనుంది కేంద్రంలోని మోదీ సర్కార్. పీఎం కిసాన్ స్కీం డబ్బులను భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తీసుకువచ్చే బడ్జెట్ లో మరో ఇన్ స్టాల్ మెంట్ అదనంగా ఇవ్వవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంటే మరో రూ. 2వేలు అదనంగా జమ కానున్నాయి.

PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్!
New Update

PM Kisan Scheme : కేంద్రం రైతులకు తీపికబురు అందించబోతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే..అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ కొత్త ఏడాదిలో భారీ కానుక అందించొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకు పీఎం కిసాన్(PM Kisan )డబ్బులు ఎంత పెరగవచ్చు. ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలాంటి అంశాలను మరోసారి తెలుసుకుందాం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) ఈ ఏడాది తీసుకువచ్చే బడ్జెట్ లో పీఎం కిసాన్ డబ్బులను మరో ఇన్ స్టాల్ మెంట్ అదనంగా ఇవ్వవచ్చని నివేదికలను బట్టి చూస్తే తెలుస్తోంది. అంటే అన్నదాతలకు మరో రూ. 2వేలు అధికంగా లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో డబ్బులు పడుతున్నాయి. ఏడాదికి మొత్తంగా రూ. 6వేలు పడుతున్నాయి. అదే మరో విడత పెంచితే అప్పుడు రూ. 8వేలు వచ్చే అవకాశం ఉంది. కాగా కేంద్రం ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల పీఎం కిసాన్ స్కీం డబ్బులు పెరుగుతాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పే అవకాశం లేదు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024ని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ లో పీఎం కిసాన్ డబ్బుల పెంపు ప్రతిపాదన ఉండొచ్చని నివేదికలు చెబుతున్నారు. అందువల్ల పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయా? లేదా? అని తెలుసుకోవడానికి మరో రెండు నెలలు ఆగాల్సిందే. అంతేకాదు 2024లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ప్రభుత్వం కేంద్రం బడ్జెట్ లో పీఎం కిసాన్ స్కీం(PM Kisan Scheme) డబ్బులు పెంపు ప్రాతిపాదన చేయోచ్చని అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

కాగా ఇప్పటి వరకు కేంద్రంలోని 15విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. రూ. 30 వేలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో 16వ విడత డబ్బులు రానున్నాయి. అవి కూడా వస్తే అన్నదాతలకు రూ. 32 వేలు మొత్తంగా లభించినట్లు అవుతుంది. ఇకపోతే రైతులు ఇంకా ఎవరైనా పీఎం కిసాన్ స్కీంలో చేరాల్సి వస్తే ...పీఎం కిసాన్ సైట్లోకి వెళ్లి నేరుగా జాయిన అవ్వొచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పొలం పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు ఉంటే చాలు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ తో మొబైల్ లింక్ అయి ఉండాలి.

ఇది కూడా చదవండి : ఇండియన్ ఆయిల్ లో డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1,603 జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!

#pm-modi #finance-minister-nirmala-sitharaman #pm-kisan-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe