16 ఏళ్ళ బాలిక మీద వర్చువల్ రేప్..ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు

యూకేలో ఒక విచిత్రమైన రేప్ కేసు నమోదయింది. 16 ఏళ్ళ బాలికను వర్చువల్‌గా రేప్ చేశారంటూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనివలన బాలిక శరీరానికి ఏమీ కాకపోయినా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక వేదనను అనుభవిస్తోందని చెబుతున్నారు.

New Update
16 ఏళ్ళ బాలిక మీద వర్చువల్ రేప్..ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు

Virtual Rape case:మానసిక వేదనకు గురి చేయడం కూడా ఒక నేరమే. అయితే ఇందులో చాలా రకాలు ఉంటాయి. డైరెక్ట్ మనుషుల మీద ఎటాక్ చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య వర్చువల్‌గా కూడా ఇవి ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఇందులో కూడా వింత కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కామెంట్స్ చేశారు, వీడియోలు పెట్టారు అంటూ కంప్లైంట్‌లు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు యూకేలో తనను వర్చువల్‌గా రేప్‌ చేశారంటూ ఒక 16 ఏళ్ళ అమ్మాయి కేసు పెట్టింది. దీని వలన తాను మానసికంగా బాధను అనుభవిస్తున్నానని చెబుతోంది.

Also read:టైమ్ అంటే టైమే…శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో ఘనత

అసలేం జరిగింది అంటే...వర్చువల్ రియాలిటీ గేమ్‌లో 16 ఏళ్ల బాలిక డిజిటల్ అవతార్ లేదా డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారం చేశారు. అమ్మాయి ఆన్‌లైన్ గేమ్‌లో లీనమై ఉండగా.. కొంతమంది పురుషులు ఆమె క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. బాలిక పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు.. ఇందులో వాస్తవంగా బాలికపై అత్యాచారం జరగకున్నా, ఎలాంటి గాయాలు కాకున్నా కూడా ఆమె తాను అత్యాచారానికి గురైనట్లు మానసిక బాధను అనుభవిస్తోందని అంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి వర్చువల్ లైంగిక నేరం ఇదే అని చెబుతున్నారు. ఈ మానసిక బాధను ఎక్కువ కాలం ఆమెపై ప్రభావం చూపించే అవకాశం ఉందని యూకే పోలీస్ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలాంటి కేసులపై ప్రత్యేకంగా చట్టాలు లేవని, దీంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే, బాలిక ఏ గేమ్ ఆడుతుందనేది అస్పష్టంగా ఉందని చెప్పారు. ఈ కేసుపై యూకే హోం సెక్రటరీ జెమ్స్ క్లివర్లీ మాట్లాడుతూ.. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్ళిందని తెలిపారు.

మరోవైపు ఆ అమ్ఇమాయి ఆడినది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమ ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని, మా వినియోగదారులకు ఆటోమాటిక్ రక్షణ ఉంటుందని, అపరిచిత వ్యక్తుల్ని దూరంగా ఉంచుతుందని మెటా ప్రతినిధులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు