AP : టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ.. ఆశావాహుల్లో మొదలైన టెన్షన్!

ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా ఈ రోజు ఉదయం 11.40కు విడుదల కానుంది. 60-70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ముందుగా రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలపై ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తుండగా ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది.

AP : టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ.. ఆశావాహుల్లో మొదలైన టెన్షన్!
New Update

TDP-Janasena : ఏపీ(AP) లో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోయే టీడీపీ-జనసేన(TDP-Janasena) అభ్యర్థుల మొదటి జాబితా ఈ రోజు విడుదల కానుంది. 60-70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుండగా.. టీడీపీ నుంచి 50కి పైగా జనసేన నుంచి 10కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన వెలవడనుంది. ముందుగా రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలపై ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం..
ఈ మేరకు ఉదయం 11.40 కి జాబితా విడుదల చేయనుండగా 9 గంటలకే ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు(Chandrababu) సీట్ల ప్రకటనపై చర్చిస్తున్నారు. టీడీపీ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా చంద్రబాబు నివాసం చేరుకుంటున్నారు. 10 గంటల తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. చంద్రబాబు నివాసానికి చేరుకొనున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లలో ఒకరిద్దరికి మినహా మిగతా వారికి యధాతథం ఉండనున్నట్లు సమాచారం. బీజేపీ(BJP) తో పొత్తులపై క్లారిటీ వచ్చిన తరువాత మిగిలిన స్థానాల్లో ఖరారు చేయనున్నారు. ఈ సందర్భంగా ఈసారి మోత మోగిస్తాం అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

విశాఖ టీడీపీ లిస్ట్:
1. పాయకరావుపేట - వంగలపూడి అనిత
2. నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
3. విశాఖ వెస్ట్ - గణబాబు
4. విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ
5. అరకు - దొన్ను దొర
6. పెందుర్తి - బండారు సత్యనారాయణ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా :
1. శ్రీకాకుళం (టీడీపీ)
2. ఇచ్చాపురం (టీడీపీ).
3. పలాస (టీడీపీ).
4. టెక్కలి (టీడీపీ).
5. పాతపట్నం (జనసేన).
6. పాలకొండ (టీడీపీ).
7. రాజాం (టీడీపీ).
8. నరసన్నపేట (టీడీపీ).
9. ఆమదాలవలస (టీడీపీ).
10. ఎచ్చెర్ల (జనసేన).

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన పోత్తులో ప్రకటించే సీట్లు:
1.రాజమండ్రి సిటీ.. ఆదిరెడ్డి వాసు (టీడీపీ )
2.జగ్గంపేట.. జోతులనేహ్రూ (టీడీపీ )
3.తుని.. యనమల దివ్య (టీడీపీ )
4.పెద్దాపురం..నిమ్మకాయల చిన్నరాజప్ప (టీడీపీ )
5.అనపర్తి ..నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (టీడీపీ )
6.మండపేట.. వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ )
7.ప్రత్తిపాడు..వరుపుల సత్యప్రభ (టీడీపీ )
8.రాజోలు.. దేవ వరప్రసాద్ (లేదా) రాపాక రమేష్ (జనసేన)
9.రాజమండ్రి రూరల్.. కందుల దుర్గేష్ (జనసేన)
10. నిడదవోలు - బూరుగుపల్లి శేషారావు (టీడీపీ)

పశ్చిమ గోదావరి:
ఆచంట - పితాని సత్యనారాయణ (టీడీపీ )
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు (టీడీపీ )
ఉండి - వేటూకూరి శివరామరాజు (టీడీపీ )
నరసాపురం - బొమ్మిడి నాయకర్ (జనసేన )
తణుకు - ఆరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ )

ఉమ్మడి ప్రకాశం జిల్లా:
1. ఒంగోలు -దామచర్ల జనార్దన్ (టీడీపీ )
2. అద్దంకి - గొట్టిపాటి రవి (టీడీపీ )
3. కొండపి - డోలాశశ్రీ బాల విరాంజీనేయ స్వామీ (టీడీపీ )
4. కనిగిరి - ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి (టీడీపీ )
5. మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి (టీడీపీ )
6. ఏర్రగొండపాలెం - గూడూరి ఎరిక్షన్ బాబు (టీడీపీ )
7. పర్చూరు - ఏలూరి సాంశివరావు (టీడీపీ )

గుంటూరు జిల్లా:
1. మాచర్ల- జూలకంటి బ్రహ్మారెడ్డి (టీడీపీ)
2. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు (టీడీపీ)
3. సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ (టీడీపీ)
4. చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు(టీడీపీ)
5. వినుకొండ-జీవీ ఆంజనేయులు (టీడీపీ)
6. పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (టీడీపీ)
7. వేమూరు-నక్కా ఆనందబాబు (టీడీపీ)
8. బాపట్ల-వేగేశన నరేంద్ర వర్మ (టీడీపీ)
9. రేపల్లె-అనగాని సత్యప్రసాద్ (టీడీపీ)
10. మంగళగిరి-నారా లోకేష్ (టీడీపీ)
11. ప్రత్తిపాడు-బూర్ల రామాంజనేయులు (టీడీపీ)
12. తెనాలి-నాదెండ్ల మనోహర్ (జనసేన)

కడప :
కడప : మాధవి రెడ్డి
రాయచోటి : మండిపల్లి ప్రసాద్ రెడ్డి
జమ్మలమడుగు: భూపేష్ రెడ్డి
పులివెందుల: బీటెక్ రవి

ఏలూరు జిల్లా:
1. దెందులూరు - చింతమనేని ప్రభాకర్ (టీడీపీ)
2. పోలవరం - బొరగం శ్రీనివాస్ (టీడీపీ)
3. ఉంగుటూరు - గన్ని వీరాంజనేయులు (టీడీపీ)
4. ఏలూరు - రెడ్డి అప్పలనాయుడు (జనసేన)

కర్నూలు టీడీపీ కన్ఫర్మేషన్ లిస్ట్:
1. పత్తికొండ - కెయి శ్యాం (టీడీపీ)
2. ఎమ్మిగనూరు - బీవీ జయనాగేశ్వర రెడ్డి (టీడీపీ)
3. కర్నూలు టీజీ భరత్ (టీడీపీ)
4. బనగానపల్లి బిసి జనార్ధన్ రెడ్డి (టీడీపీ)
5. నంద్యాల Nmd ఫరూక్ (టీడీపి)
6. శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి (టీడీపి)
7. పాణ్యం గౌరు చరిత (టీడీపి)

కాంట్రవర్సీ నియోజకవర్గాలు:
8. ఆలూరు కోట్ల సుజాతమ్మ/వీరభద్ర గౌడ్
9. మంత్రాలయం తిక్కారెడ్డి/రాఘవేంద్ర రెడ్డి (వాల్మీకి)
10. కోడుమూరు (ప్రభాకర్/బొగ్గుల దస్తగిరి)
11. డోన్ (ధర్మవరం సుబ్బారెడ్డి /కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి)
12. నందికొట్కూరు (జయసూర్య/ఆర్థర్/చిన్న వెంకట్ స్వామి)

ఉమ్మడి నియోజకవర్గాలు:
1. ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియ (టీడీపీ)/ జనసేన అభ్యర్థి నో క్లారిటీ) బీజేపీతో పొత్తు ఉంటే (భూమా కిషోర్ రెడ్డి)
2. ఆదోని మీనాక్షి నాయుడు (టీడీపీ)/ మల్లప్పా (జనసేన )

#andhra-pradesh #first-list #tdp-janasena
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి