Lok Sabha Elections : ఐదో విడతకు రంగం సిద్ధం.. రాహుల్, రాజ్ నాథ్ స్థానాల్లో ఉత్కంఠ!

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో జరగనుంది. వీటికోసం మొత్తం 94,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతీ ఇరానీ వంటి ప్రముఖుల భవితవ్యం ఈ విడతలోనే తేలనుంది.

Elections 2024 6th Phase: ప్రశాంతంగా సాగుతున్న 6వ దశ పోలింగ్ ఉదయం 9 గంటల వరకూ ఓటింగ్ ఎంతంటే.. 
New Update

Fifth Phase Polling : సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) భాగంగా ఐదో విడత పోలింగ్‌ సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ (Lok Sabha) స్థానాల్లో జరగనుంది. వీటిలో ఉత్తర​ప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్‌లోని 7, బిహార్‌లోని 5, ఒడిశాలోని 5, జార్ఖండ్‌లోని 3, జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లో ఒక్కో లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తంగా 695 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 613 మంది పురుషులు, 82 మంది మహిళలున్నారు. ఇక మొత్తం ఓటర్లు 8.95 కోట్లు ఉండగా.. 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు, 5,409 మంది థర్డ్ జెండర్లు ఓటు వేయనున్నారు.

ఇక ఈ ఎన్నికల ప్రక్రియ కోసం 94,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బంది తరలింపు, భద్రతా సిబ్బంది మోహరింపు కోసం 17 ప్రత్యేక రైళ్లు, 508 హెలికాప్టర్ సర్వీసులను (Helicopter Service) వినియోగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) (రాయ్‌బరేలీ), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ (Rajnath Singh) (లక్నో), కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (అమేథీ), బీజేపీ సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ (సరన్), కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ (నార్త్ ముంబై), లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ (హాజీపూర్), రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌(కైసర్ గంజ్) వంటి ప్రముఖు నాయకుల భవితవ్యం విడతలోనే తేలనుంది.

Also Read : కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు!

#rahul-gandhi #rajnath-singh #fifth-phase #lok-sabha-polling
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe