High Court: భారమంతా భార్యపైనే వేసి రెస్ట్ తీసుకుంటున్న భర్తలు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల పోషణకు సంబంధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court)సంచలన తీర్పును వెలువరించింది. తల్లి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ.. పిల్లలను పోషించే బాధ్యత వారి తండ్రిదేనని కోర్టు పేర్కొంది.
భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు:
తన భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసినప్పటి నుంచి పిల్లల పోషణలో అతడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని నిభా సింగ్(Nibha Singh) అనే మహిళ హజారీబాగ్(Hazaribagh)లోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది.తన భర్తకు పూర్వీకుల వ్యవసాయ భూమి నుంచి ఆదాయం కూడా వస్తుందని దరఖాస్తులో పేర్కొంది. అయినప్పటికీ తన భర్తల పిల్లల బాగోగులు చూడటం లేదంటూ పేర్కొంది.
ఈ కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం(Family Court), ఇద్దరు పిల్లల పోషణ కోసం నెలకు రూ.5,000 చెల్లించాలని సదరు మహిళ భర్త రఘువర్ సింగ్‌ను ఆదేశించింది. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలపై రఘువర్ సింగ్ జార్ఖండ్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.అయితే తను నిరుద్యోగి అని, తన భార్య మెయింటెనెన్స్ దరఖాస్తు దాఖలు చేయడానికి చాలా కాలం ముందు నుంచే ఉద్యోగం చేస్తుందని కోర్టుకు తెలిపాడు.
అయితే, ఇరువర్గాలు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా రఘువర్ సింగ్ గతంలో బ్యాంకులో లోన్ మేనేజర్‌గా పనిచేసి ప్రస్తుతం ఎన్జీవోలో పనిచేస్తున్నట్లు కోర్టు నిర్ధారించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ చంద్ తన ఉత్తర్వులో, “పోషణ దరఖాస్తులో పిటిషనర్ భార్య ఆదాయానికి సంబంధించినంతవరకు, ఆమె నెలకు రూ. 12 నుండి 14 వేలు పొందుతోంది. ఆమె తనను,తన ఇద్దరు మైనర్లను బాధ్యతను చూసుకుంటుంది. అందుకోసం ఉద్యోగం చేస్తుంది. తల్లి ఇద్దరు పిల్లలను పోషిస్తున్నప్పటికీ...పిల్లల పోషణ బాధ్యత తండ్రికూడా ఉంటుందని కోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో పాటు రఘువర్ సింగ్‌కు అతని ఇద్దరు మైనర్ పిల్లలకు నెలకు రూ.5,000 ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
ఇది కూడాచదవండి: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!!