/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-8-5-jpg.webp)
Sonali : నటి సోనాలి బింద్రే (Sonali Bendre) తన అప్ కమింగ్ వెబ్ సిరీస్ ‘ది బ్రోకెన్ న్యూస్’సీజన్2(The Broken News Season 2) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ చిత్రం మే3 నుంచి జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నానంటూ ఎమోషనల్ అయింది.
Picking up where we left off… 💙#TheBrokenNewsS2pic.twitter.com/8FTEOSUuUD
— Sonali Bendre Behl (@iamsonalibendre) March 22, 2024
ఇది కూడా చదవండి:Nani: గుండె బరువెక్కిందన్న నాని.. ఇంకా తనివితీరలేదంటూ అంజనా పోస్ట్.. వైరల్!
ఈ మేరకు ‘డూప్లికేట్’(Duplicate) మూవీ తనకు వృత్తిపరంగా ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పింది. 'నాకు నెగెటివ్ షేడ్స్ పాత్రలు చేయాలనుంది. అందులో నటించడం సవాలుగా అనిపించి ఆత్రుతగా ఎదురుచూశా. కానీ, చిత్రీకరణ మొదలుపెట్టాక నేను చేస్తున్నది కీలకపాత్ర కాదని.. కార్టూన్ వంటిదేననే అనుకున్నా. స్టోరీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా. అప్పటి నుంచి ఏ పాత్ర గురించైనా లోతుగా తెలుసుకుంటున్నా. ఇప్పటికీ ఎవరైనా ఆ సినిమా పాటలు ప్లే చేసినా.. దాని ప్రస్తావన తెచ్చినా నాకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక అలాంటి వాటిని ఎంచుకోకుండా జాగ్రత్త పడుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.