Nani : గుండె బరువెక్కిందన్న నాని.. ఇంకా తనివితీరలేదంటూ అంజనా పోస్ట్.. వైరల్! 'జెర్సీ' సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాని, అతని భార్య అంజనా నెట్టింట ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అర్జున్ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయిందన్నారు. సుదర్శన్ థియేటర్ లో అభిమానులతో షో చూసి సందడి చేశారు. By srinivas 21 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jersey : నాని(Nani) నటించిన 'జెర్సీ' మూవీ నేటితో 5ఏళ్లు పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి స్పోర్ట్స్ డ్రామా(Sports Drama) గా తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్(Sraddha Srinath) హీరోయిన్ గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ అయింది. అయితే ఐదేళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్(Hyderabad) లోని సుదర్శన్ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్ షో వేశారు. ఈ షోకు నాని తన ఫ్యామిలీతో హాజరై అభిమానులతో సందడి చేశారు. View this post on Instagram A post shared by Nani Fans Association (@nfa_hyd) అర్జున్ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది.. ఈ సందర్భంగా నాని ఫ్యాన్స్ చూపిస్తున్న ఆదరణకు ఖుషీ అవుతూ పోస్ట్ పెట్టాడు ‘ఈరోజు నాకెంతో ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఫ్యాన్స్ ఆదరణ చూస్తుంటే.. మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే నాని భార్య అంజనా(Anjana) సైతం.. ‘ఫస్ట్ టైమ్ థియేటర్‌లో సినిమా చూసిన రోజులు గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్ సాంగ్ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టగా రెండూ వైరల్ అవుతున్నాయి. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనున్నారు. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #jersey #nani #anjana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి