ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే అవి కాస్త బెట్టింగ్ యాప్‌లో పెట్టాడు… చివరకు లక్షా 20 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు.. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మనస్తాపం చెంది చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. నల్లగొండ-రవీంద్రనగర్‌కు చెందిన కోడూరు నితిన్‌కి చెందిన కథ ఇది. ఇలాంటి నితిన్‌లు ఇండియాలో మనకు చాలా చోట్ల కనిపిస్తారు. ఇలాంటి విషాధ గాధలు ప్రతీరోజూ వినిపిస్తుంటాయి. బెట్టింగ్ యాప్స్‌కు బలయ్యే వారు తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు అటు దేశానికి, దేశభద్రతకూ ముప్పును తీసుకువస్తున్నారు. అవును.. ఇది నిజమే..! మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు బెట్టింగ్ యాప్స్ అడ్డాలని పలు రీసెర్చుల్లో తేలింది!
పూర్తిగా చదవండి..Betting Apps: దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న బెట్టింగ్ యాప్‌లు
మహదేవ్లాంటి బెట్టింప్ యాప్‌లు దేశ భద్రతకు ముప్పుగా మారాయి. అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు చేరుతున్నాయి. ఇది టెర్రర్ ఫైనాన్సింగ్ కిందకే వస్తాయని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Translate this News: