Central Government : రూట్ మార్చిన కేంద్రం.. ఇక మేడ్ ఇన్ ఇండియా.. మళ్లీ అధికారంలోకి రాగానే..!

బీజేపీ మళ్లీ మూడోసారి అధికారంలోకి వస్తామని బలంగా నమ్ముతోంది. అందులో భాగంగా.. అధికారంలోకి రాగానే ఏం చెయ్యాలి అనే దానిపై ఇప్పటికే చాలా ప్లాన్స్ వేసుకుంటోంది. అందులో భాగంగా మేడ్ ఇన్ ఇండియా సంగతులేంటో చూద్దాం.

PM Oath Ceremony: మూడోసారి ప్రమాణానికి స్పెషల్ గెస్ట్‌లు..రానున్న విదేశీ నేతలు
New Update

Made In India : మనం విదేశీ గాడ్జెట్స్ కొన్నప్పుడు వాటిపై మేడిన్ చైనా(Made In China), మేడిన్ జపాన్(Made In Japan) వంటివి చూస్తుంటాం.. అలాగే ఇండియా(India) కి.. మేడ్ ఇన్ ఇండియా అనే ముద్ర ఉంది. కానీ.. కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాక.. మేక్ ఇన్ ఇండియా అనే నినాదం అందుకొని.. మేడ్ ఇన్ ఇండియాని పక్కన పెట్టింది. ఐతే.. ఇది ఇండియాలోనే తప్ప.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందలేదు. తాజాగా కేంద్రం మళ్లీ మేడ్ ఇన్ ఇండియాపై ఫోకస్ పెడుతోంది. మళ్లీ అధికారంలోకి వచ్చి.. మొదటి 100 రోజుల్లోనే మేడ్ ఇన్ ఇండియా స్కీమ్ ప్రారంభించాలి అనుకుంటోంది.

ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్టరింగ్, ఫార్మాస్యూటికల్స్, టెలికం, నెట్‌వర్క్ ప్రొడక్టులపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర వేస్తుందని తెలుస్తోంది. అలాంటి ఉత్పత్తులను విదేశాలకు పంపుతూ.. వాటిపై మేడ్ ఇన్ ఇండియా ముద్రను వెయ్యడం ద్వారా.. ఇండియా స్థాయిని అంతర్జాతీయంగా పైకి తేవాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

కేంద్రం 2014లో తెచ్చిన మేక్ ఇన్ ఇండియాకి అదనపు స్కీమే ఈ మేడ్ ఇన్ ఇండియా. ఇప్పటికే ఈ లేబుల్ ఎలా ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, ఏయే ఉత్పత్తులపై వెయ్యాలి వంటి అంశాలపై లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటికే స్టీల్ రంగంలో విజయవంతంగా అమలుచేశారు. ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ స్కీమ్‌ని అమల్లోకి తేవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పథకాన్ని పైలట్ పథకంగా గతేడాది నవంబర్‌లో కేంద్రం అమలుచేసింది. ఇందుకోసం జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్, ప్రభుత్వ రంగ స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా(SAIL) ని ఎంచుకుంది. ఈ రెండు కంపెనీలు ఆల్రెడీ దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

Also Read : 50 శాతం తగ్గిన శాంసంగ్ ఫోన్ ధర..అస్సలు మిస్ కావద్దు బ్రో!

కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటోంది. అలాగే.. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా స్టాండ్‌ని పెంచాలనుకుంటోంది. అలా జరగాలంటే.. మేడిన్ ఇండియా అనే బ్రాండ్‌కి గుర్తింపు పెరగాలి. తద్వారా భారత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో వాటి కాలిటీ విషయంలో రాజీ పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ గమనిస్తూ కేంద్రం మేడ్ ఇన్ ఇండియా స్కీమ్ తేబోతున్నట్లు తెలుస్తోంది.

#narendra-modi #made-in-india #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe