IPL : స్పీడ్ గన్ అవకాశాల కోసం 2ఏళ్ల నిరీక్షణ!

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ యువ ఆటగాడి పేరు అందరి నోళ్లలో నానుతోంది. కేవలం అతని వయస్సు 21 ఏళ్లు మాత్రమే. ఆడింది కేవలం రెండు ఐపీఎల్ మ్యాచ్ లే.  కాని బంతి విసిరాడంటే ప్రత్యర్థులు బెంబెలేత్తాల్సిందే.ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల కంతా ఆ ఆటగాడి పైనే చూపంతా!

New Update
Cricket : ఒక్క మ్యాచ్ అతని జీవితాన్ని మార్చేసింది.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన స్పీడ్‌గన్ మయాంక్

Mayank Yadav : IPL లో ఆడటానికి రెండేళ్ల నుంచి ఎదురుచూశాడు. వచ్చిన అవకాశాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో అతన్ని ఉదాహరణగా చెప్పోచ్చు. ఇప్పుడు IPL 2024లో ప్రత్యర్థులను తన ఫాస్ట్ బౌలింగ్ తో భయపెడుతున్నాడు యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్. మొదట పంజాబ్ కింగ్స్‌పై , ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గత రెండు సీజన్లలో అతనిని డగౌట్ లోనే కూర్చోబెట్టామని కెప్టెన్ కేఎల్ రాహుల్ అంగీకరించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) క్వింటన్ డి కాక్ అర్ధశతకం తో 181 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దీని తర్వాత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ 3 వికెట్ల ఆధారంగా బెంగళూరు 153 పరుగులకే కుప్పకూలింది. 21 ఏళ్ల మయాంక్పంజాబ్ కింగ్స్‌పై ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారా రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

ఈ ఫాస్ట్ బౌలర్‌ను  2022లో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షలు చెల్లించి అతడిని జట్టులో చేర్చుకుంది. అతను గత రెండు సీజన్లలో జట్టుతో ఉన్నాడు కానీ ఏ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గత మ్యాచ్‌లో మయాంక్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరుపై 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

మయాంక్ వికెట్‌ను ఉపయోగించిన విధానం మా జట్టు విజయంలో ప్రత్యేక పాత్ర వహించింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశాంతంగా ఉండటం వల్లే అతడు దీన్ని సాధించాడు.  రెండు సీజన్లలో అవకాశాలు రాకపోవడంతో నెట్స్ లో తనని తాను నిరూపించుకోవటం కోసం కష్టపడేవాడు. మయాంక్ బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాగుంది. అతను గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఓపికగా ఉన్నాడు, ఇది ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌ కు ఎంతో అవసరం.అతడు తొందరలోనే భారత జట్టులో అడుగుపెడతాడు.

Advertisment
తాజా కథనాలు