Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 10391 ఉద్యోగాలపై కీలక అప్డేట్!

దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో టీచర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 10,391 మంది టీచింగ్‌,నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే ఎప్పుడో నోటిఫికేషన్‌ విడుదల కాగా..దానికి సంబంధించి గడువు మరోసారి పెంచారు అధికారులు.

New Update

ఇంకా ఎవరైనా అర్హులైన వారు ఉంటే అక్టోబర్‌ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఈఎస్‌టీఎస్‌ తెలిపింది. ఈ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన మూడేళ్ల ఇంటిగ్రెటెడ్‌ బీఈడీ , ఎంఈడీ ఉన్న అభ్యర్థులతో పాటు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని వివరించారు.

Also read: 2028 నుంచి ఒలింపిక్స్‌ లో క్రికెట్‌: ఐఓసీ!

ఈ ఏడాది జూన్‌ లో 4,062 ఖాళీలకు, ఆ తరువాత 6,329 పోస్టుల భర్తీకి రెండు నోటిషికేషన్లు విడుదల అయ్యాయి. వీటిని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌ఈఎస్టీఎస్‌ విడుదల చేసింది. https://emrs.tribal.gov.in/ ఈ వెబ్ సైట్‌ లో అర్హులైన వారు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపాల్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, హాస్టల్ వార్డెన్(మేల్/ఫిమేల్), పీజీటీ, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు బీఈడీ, డీఈడీ, సీటెట్, డిగ్రీ, డిప్లొమా తదితర అర్హతలు కలిగి ఉండాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు