Thatikonda Rajaiah: ఎంపీ టికెట్ రాలేదని నిరాశ పడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగించారు. ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు తాటికొండ రాజయ్య. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్.
ALSO READ: సీఎం జగన్‌పై దాడి.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజయ్యకు మొండిచేయి..
ఇటీవల తనకు కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ఆశగా ఫామ్ హౌస్ వెళ్లిన రాజయ్యకు నిరాశే మిగిలింది. ఎంపీ టికెట్ రాజయ్యకు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాటికొండ రాజయ్యను పక్కకు పెట్టి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ను కడియం శ్రీహరికి ఇచ్చారు కేసీఆర్. దీంతో భంగపడ్డ తాటికొండ రాజయ్య.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన కలిశారు. అందరు ఆయన కాంగ్రెస్ లో చేరుతారని అనుకున్నారు.
కానీ.. తనకు రాజకీయంగా భద్ర శత్రువుగా ఉన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కడియం బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో కేటీఆర్ తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలని రాజయ్యను ఆహ్వానించారు. కాగా కేటీఆర్ హామీ.. కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఎంపీ టికెట్ వస్తుందని అనుకున్న రాజయ్యకు చివరికి నిరాశే మిగిలింది.