Delhi Borewell : ఢిల్లీ(Delhi) లోని బోరు బావిలో పడింది చిన్నారి కాదు 20 ఏళ్ళ యువకుడు అని చెబుతున్నారు ఎన్డీఆర్ఎఫ్(NDRF) అధికారులు. అర్ధరాత్రి వాటర్ బోర్డు ప్లాంట్(Water Board Plant) దగ్గర ఉన్న అపార్ట్‌మెంట్స్‌లో దొంగతనానికి వచ్చిన యువకుడు... చీకటిలో పరుగెడుతూ బోరుబావి(Borewell) లో పడిపోయాడు. అయితే అన్ని వార్తా ఛానెళ్ళు, వెబ్ న్యూస్ పోర్టళ్ళు బోరు బావిలో పడింది చిన్నారి అనే చెప్పారు, రాశారు. మేము కూడా మొదట బోరు బావిలో పడింది చిన్నారనే న్యూస్ రాశాము. కానీ ఇప్పుడు వాటర్ బోర్డు ఉద్యోగుల ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ ఉన్నది యువకుడు అని తెలిసింది. చీకట్లో బోరు బావిని గమనించకపోవడం వలన అందులో పడిపోయాడని తెలిపారు. రాత్రి 1:15 గంటలకు పోలీసులకు వచ్చిన కాల్ ప్రకారం.. ఎవరో దొంగతనం చేసేందుకు తమ కార్యాలయానికి వచ్చి బోరుబావిలో పడ్డారని జల్ బోర్డు ఉద్యోగులు తెలిపారు. యువకుడి ఆచూకీ తెలియలేదు.
కొనసాగుతున్న సహాయక చర్యలు..
అయితే యువకుడు బోరుబావిలో పడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మొదట చిన్నారి పడిపోయింది అనుకున్నారు. దీంతో వెంటనే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే వారు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే తర్వా తెలిసింది బోరు బావిలో ఉన్నది యువకుడు అని. అయితే సహాయక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బోరు బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వి యువకుడిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. బోరుబావి దగ్గర జేసీబీతో దాదాపు 50 అడుగుల మేర తవ్వకాలు చేయనున్నారు. అనంతరం బోర్‌వెల్ పైపు కోసి యువకుడిని బయటకు తీస్తారు.
Also Read : Movies : స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న సూపర్‌స్టార్