Thangalaan : సెన్సార్ పూర్తి చేసుకున్న 'తంగలాన్'.. విక్రమ్ సినిమాకు జీరో కట్స్, రన్ టైమ్ ఎంతంటే? చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్ ' సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్‌ను సూచించకపోవడం గమనార్హం. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌గా ఉంది. By Anil Kumar 30 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Thangalaan Movie : తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో 'తంగలాన్' ఒకటి. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వంల వహించారు. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. విక్రమ్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విధమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటించగా.. కలైరాణి, రంజిత్ జయకోడి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయినట్లు మూవీ టీమ్ తెలిపింది. సెన్సార్ బోర్డు తంగలాన్ చిత్రానికి క్లీన్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఎలాంటి కట్స్‌ను సూచించకపోవడం గమనార్హం. దీని అధికారిక రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌గా ఉంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తమిళ చిత్ర పరిశ్రమకు మరో మైలురాయిగా నిలుస్తుందని మూవీ టీమ్ భావిస్తోంది. విక్రమ్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. Also Read : ఓటీటీలోకి ‘RX100’ బ్యూటీ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..? An ‘U’nearthing ‘A’dventure awaits us all with #Thangalaan 🌋 We’re Certified ‘UA’🔥 #ThangalaanFromAug15 @Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe @StudioGreen2 #NeelamProductions @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @Dhananjayang @KvnProductions @APIfilms… pic.twitter.com/XHncWAm2PU — Neelam Productions (@officialneelam) July 25, 2024 ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మరోవైపు ఆగస్టు బరిలో ఇప్పటికే 'డబుల్ ఇస్మార్ట్', మిస్టర్ బచ్చన్, స్త్రీ 2 వంటి మూవీస్ రిలీజ్ కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాలకు క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. #chiyaan-vikram #thangalaan-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి