Rakshana : ఓటీటీలోకి 'RX100' బ్యూటీ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..? పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ 'రక్షణ' ఓటీటీకి రెడీ అయ్యింది. ఆగస్టు 1 నుంచి 'ఆహా'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' సంస్ధ ట్వీట్ చేస్తూ..'లేడీ సింగ్ గర్జించేందుకు వస్తోంది' అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. By Anil Kumar 30 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Payal Rajput's Rakshana Movie : టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ 'రక్షణ' ఓటీటీకి రెడీ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్ 7న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. రక్షణ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న 'ఆహా' ఓటీటీ.. ఈ మూవీని ఆగస్టు 1, 2024 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని 'ఆహా' సంస్ధ ట్వీట్ చేస్తూ..'లేడీ సింగ్ గర్జించేందుకు వస్తోంది' అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ రాజ్‌పుత్ కనిపించిన ఈ మూవీలో ఆమె యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. Lady Singam is ready to roar!👮🏻♀️ Payal's 'Rakshana' is coming on aha!!🎬 #Rakshana premieres Aug 1st only on aha @starlingpayal @ActorMaanas @RajeevCo @actorchakrapani @sivannarayana_ @PrandeepThakore pic.twitter.com/sOdDmVSHKz — ahavideoin (@ahavideoIN) July 29, 2024 పాయల్ ఫస్ట్ టైమ్ చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మూవీని ప్రణవ్ ఠాకూర్ దర్శకత్వం వహించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు మానస్, రాజీవ్ కనకాల, శివన్నారాయణ, వినోద్ బాలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. #payal-rajput #rakshana-movie-ott మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి